For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9 శాతం ఎగిసిన HUL లాభాలు, హార్లిక్స్‌తో కలిసొచ్చింది...

|

FMCG దిగ్గజం హిందూస్తాన్ యూనీలీవర్(HUL) మార్కెట్ అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడంతో డిమాండ్ క్రమంగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,974 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,818 కోట్లతో పోలిస్తే 8.6 శాతం అధికం. మొత్తం విక్రయాలు కూడా రూ.9,931 కోట్ల నుండి 15.9 శాతం ఎగిసి రూ.11,510 కోట్లకు చేరాయి. వ్యయాలు రూ.7,885 నుండి 15 శాతం ఎగిసి రూ.9,054 కోట్లకు చేరుకున్నాయి.

మా ఫ్యామిలీ ఆస్తులు అమ్మేస్తాం: కపిల్ రూ.43,000 కోట్ల ఆఫర్మా ఫ్యామిలీ ఆస్తులు అమ్మేస్తాం: కపిల్ రూ.43,000 కోట్ల ఆఫర్

ఆహార, రిఫ్రెష్‌మెంట్ వ్యాపారం వృద్ధిరేటు దాదాపు 83 శాతం పెరిగింది. ఈ విభాగం ఆదాయం రూ.1,847 కోట్ల నుండి 82.94 శాతం పెరిగి రూ.3,379 కోట్లకు చేరుకుంది. హోం కేర్‌, వ్యక్తిగత సౌందర్య సాధన ఉత్పత్తుల విక్రయాలు కరోనాకు ముందుస్థాయిల్లో ఉన్నట్లు తెలిపింది. గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్ కేర్‌కు చెందిన హెల్త్ డ్రింక్ బ్రాండ్స్ హార్లిక్స్ వంటివి పోర్ట్‌పోలియోలో చేరడం కంపెనీ ఆదాయాలకు ఊతమిచ్చింది. హార్లిక్స్ జత కలిస్తే ఆరోగ్య పానీయాల విభాగం 16 శాతం వృద్ధిని నమోదు చేసింది.

 HUL Q2 results: Net profit rises 9 percent to Rs 1,974 crore

రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.14 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. ఇక, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరం (ఏప్రిల్-సెప్టెంబర్) కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7.14 శాతం పెరిగి రూ.3,871 కోట్లకు చేరుకుంది. ఆదాయం రూ.20,128 కోట్ల నుండి 9.69 శాతం వృద్ధి చెంది రూ.22,080 కోట్లకు పెరిగింది. HUL షేర్ ధర నిన్న 0.17 శాతం క్షీణించి రూ.2,174 వద్ద క్లోజ్ అయింది.

English summary

9 శాతం ఎగిసిన HUL లాభాలు, హార్లిక్స్‌తో కలిసొచ్చింది... | HUL Q2 results: Net profit rises 9 percent to Rs 1,974 crore

Hindustan Unilever(HUL) on Tuesday reported an 8.6 per cent rise in consolidated net profit at Rs 1,974 crore for the quarter ended September.
Story first published: Wednesday, October 21, 2020, 8:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X