For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబర్ 31 నుండి ఆ టెక్ దిగ్గజంలో వేతనాల్లో కోత, తగ్గిన ఆదాయ నిల్వలు

|

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి. దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగాల కోత లేదా శాలరీ కోతకు మొగ్గు చూపుతున్నాయి. ఐబీఎం వంటి టెక్ దిగ్గజం కూడా అమెరికా సహా పలు ప్రాంతాల్లో వేలాది మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం హ్యూలెట్ పాకార్డ్ ఎంటర్‌ప్రైజ్, ఎయిర్‌ఎన్బీ, ఉబెర్ టెక్నాలజీస్ ఇంక్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులకు షాకిస్తున్నాయి.

Covid 19: కంపెనీ దీర్ఘకాల సుస్థిరత కోసం IBM కఠిన నిర్ణయం!Covid 19: కంపెనీ దీర్ఘకాల సుస్థిరత కోసం IBM కఠిన నిర్ణయం!

HPE వ్యయ నియంత్రణ

HPE వ్యయ నియంత్రణ

అమెరికా దిగ్గజ హ్యూలెట్ పాకార్డ్ ఎంటర్‌ప్రైజ్ (HPE) కూడా తమ ఎగ్జిక్యూటివ్స్ శాలరీల్లో 20 నుంచి 25 శాతం మేరకు కోత విధించనున్నట్లు తెలిపింది. శాలరీ కోత, ఇతర ఖర్చులు తగ్గించడం ద్వారా 1 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేస్తామని HPE తెలిపింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపు ఇటీవలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా ఉంటుందని కూడా ప్రకటించింది. అక్టోబర్ 31వ తేదీ నుండి ఈ కంపెనీ శాలరీ కోతకు సిద్ధమైంది. ఎగ్జిక్యూటివ్స్ వేతనాల్లో 20 శాతం నుండి 25 శాతం కోత ఉండవచ్చు.

తగ్గిన ఆదాయ నిల్వలు

తగ్గిన ఆదాయ నిల్వలు

ఏడాది లెక్కన HPEలో అన్ని రకాల ఆదాయాలు తగ్గాయి. ఇంటిలలిజెంట్ ఎడ్జ్ రెవెన్యూ 2 శాతం తగ్గి 665 మిలియన్ డాలర్లుగా ఉంది. కంప్యూట్ రెవెన్యూ అంతకుముందు ఏడాది కంటే 19 శాతం తగ్గి 2.6 బిలియన్ డాలర్లు, హై పర్ఫార్మెన్స్ కంప్యూట్ అండ్ మిషన్ క్రిటికల్ సిస్టం రెవెన్యూ 18 శాతం తగ్గి 589 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆదాయ నిల్వలు 16 శాతం తగ్గి 1.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అడ్వైజరీ అండ్ ప్రొఫెషనల్స్ రెవెన్యూ 237 మిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ రెవెన్యూ 5 శాతం పడిపోయి 833 మిలియన్ డాలర్లుగా ఉంది.

ఈ సంస్థల్లోను ఉద్యోగాల కోత

ఈ సంస్థల్లోను ఉద్యోగాల కోత

ఎయిర్‌ఎన్బీ, ఉబెర్ టెక్నాలజీస్ ఇంక్ కూడా ఈ క్వార్టర్‌లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఆన్‌లైన్ ఫైనాన్సింగ్ కంపెనీ లెండింగ్‌కార్ట్ 200 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగుల్లో ఇది 30 శాతం. లాక్ డౌన్ కారణంగా కంపెనీ ఇబ్బందుల్లో కూరుకుపోవడమే ఇందుకు కారణం. అహ్మదాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేకుండా రూ.లక్ష నుంచి రూ.40 లక్షల దాకా రుణాలు ఇస్తుంది.కరోనా మహమ్మారి ప్రభావం ఐటీ రంగంపై కూడా పడింది. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తే, మరికొన్ని కంపెనీలు వేతనాలు తగ్గించాయి. ఇంకొన్ని కంపెనీలు కొత్త నియామకాలు నిలిపివేస్తున్నాయి.

English summary

అక్టోబర్ 31 నుండి ఆ టెక్ దిగ్గజంలో వేతనాల్లో కోత, తగ్గిన ఆదాయ నిల్వలు | HPE announced Major job and salary cuts

All Hewlett Packard Enterprise (HPE) employees and board members will take a pay cut following the company’s dismal second-quarter 2020 earnings that were hit hard by the global COVID-19 pandemic.
Story first published: Sunday, May 24, 2020, 11:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X