For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్ న్యూస్: ఈపీఎఫ్ లో ఇకపై మీరే మీ ఎగ్జిట్ డేట్ ను అప్డేట్ చేయొచ్చు!

|

కోట్ల మంది ఉద్యోగులకు శుభవార్త. ఇకపై మీ ఎగ్జిట్ డేట్ (లాస్ట్ వర్కింగ్ డే) ను మీరే అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్ (ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్) సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా ఆన్లైన్ లో అత్యంత సులభ విధానంలో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకుంది. సాధారణంగా మనం ఒక కంపెనీ లో ఉద్యోగం మానేసి, మరో ఉద్యోగం కోసం కొత్త కంపెనీలో చేరతాం. మనకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ (ఎఫ్ అండ్ ఎఫ్) పూర్తయ్యేందుకు కంపెనీని బట్టి నెల రోజుల నుంచి రెండు నెలల సమయం పడుతోంది.

ఆ తర్వాతే కంపెనీకి తీరిక దొరికినప్పుడు చివరి పని దినం (ఎగ్జిట్ డేట్) తో సహా ఇతర వివరాలను ఈపీఎఫ్ లో అప్డేట్ చేస్తుంది. ఆ తర్వాతే మనం ఈపీఎఫ్ నుంచి సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చు. అంతకు ముందు కుదరదు. కానీ ఇకపై అలా కాకుండా, మనకు మనమే వీలైనంత సులభంగా ఆన్లైన్ లో మన ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసుకోవచ్చు. దీంతో మనకు సమయం కలిసి వస్తుంది. అలాగే అటు కంపెనీకి కూడా కొంత పని భారం తగ్గుతుంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ఆధారంగా మీకోసం కొన్ని వివరాలు.

ఎలా అప్డేట్ చేయాలి?

ఎలా అప్డేట్ చేయాలి?

ఈపీఎఫ్ లో రికార్డులో మార్పులు చేయాలంటే ముందుగా మనం మెంబెర్ ఈ సేవ పోర్టల్ను సందర్శించాలి.

-మన యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్) తో మెంబెర్ పోర్టల్ లో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్, కాప్చ ఎంటర్ చేసిన తర్వాత మనం మన అకౌంట్ లోకి లాగిన్ అవుతాం. అంతకు ముందు మీ యూఏఎన్ నెంబర్ ఆక్టివేట్ అయిందో లేదో సరిచూసుకోవాలి.

-అందులో మేనేజ్ ట్యాబు వద్దకు చేరుకొని, అందులో నుంచి మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

-అప్పుడు ఒక కొత్త ట్యాబు ఓపెన్ అవుతుంది. అందులో మన కంపెనీ, అలాగే మన అకౌంట్ ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ ఎగ్జిట్ డేట్ ను అప్డేట్ చేసే అవకాశం లభిస్తుంది. అయితే, మన కంపెనీ చివరగా ఈపీఎఫ్ఓ కు చెల్లింపులు చేసిన 2 నెలల తర్వాతనే ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ట్యాబు లో మన కంపెనీ చివరగా చెల్లించిన నెల ను కూడా చెక్ చేసుకుని, సంబంధిత వివరాలు నమోదు చేయాలి.

కారణం వివరించాలి

కారణం వివరించాలి

- పై వివరాలు నమోదు చేసిన తర్వాత ... ఎగ్జిట్ డేట్ ను, ఎగ్జిట్ కు గల కారణాన్ని వివరించాలి.

-రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ఆధార్ తో లింక్ ఐన మన మొబైల్ నెంబర్కు వన్ టైం పాస్ వర్డ్ వస్తుంది.

-చివరగా అప్డేట్ ను క్లిక్ చేసిన తర్వాత ... ఓకే అని ప్రెస్ చెయ్యాలి. అంతే, మీ ఎగ్జిట్ డేట్ రికార్డ్స్ లో అప్ డేట్ అవుతుంది.

కంపెనీ అప్డేట్ చేసిందేమో సరి చూసుకోండి..

కంపెనీ అప్డేట్ చేసిందేమో సరి చూసుకోండి..

మనకు మనం అప్డేట్ చేయటం బాగానే ఉంటుంది కానీ అంతకు ముందు ఒకసారి మన కంపెనీ అప్పటికే రికార్డ్స్ అప్డేట్ చేసిందేమో చూసుకోవటం మంచిది. దీని గురించి తెలుసుకోవాలంటే మీ సేవ పోర్టల్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

-లాగిన్ ఐన తర్వాత వ్యూ అనే ట్యాబ్ ను సెలెక్ట్ చేసుకుని, సర్వీస్ హిస్టరీ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.

-అప్పుడు ఒక కొత్త ట్యాబు ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇప్పటి వరకు ఏ ఏ కంపెనీల్లో పనిచేసారో, అక్కడి ఈపీఎఫ్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు ఉంటాయి. అక్కడ ప్రతి కంపెనీలో జాయిన్ డేట్, ఎగ్జిట్ డేట్ వివరాలు ఉంటాయి. దాన్ని బట్టి మీ కంపెనీ ఎగ్జిట్ డేట్ ను అప్డేట్ చేసిందో లేదో తెలిసిపోతుంది.

Read more about: epf pf business news
English summary

గుడ్ న్యూస్: ఈపీఎఫ్ లో ఇకపై మీరే మీ ఎగ్జిట్ డేట్ ను అప్డేట్ చేయొచ్చు! | How to update job leaving date yourself in EPFO records online

The Employees' Provident Fund Organisation (EPFO) has made transfer and withdrawal of funds from EPF (Employees' Provident Fund) accounts simpler for its members. EPFO has launched an online facility where Employees' Provident Fund (EPF) account holders can update the exit date, i.e., date of leaving an organisation in the EPFO records.
Story first published: Wednesday, January 22, 2020, 18:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X