EPFO: పీఎఫ్ ఖాతాలో జమ అయిన వడ్డీని ఎలా చెక్‍చేసుకోవాలంటే..
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులకు వడ్డీని జమ చేసే ప్రక్రియ ప్రారంభించింది. వడ్డీ పూర్తిగా జమ అయిందని, నష్టమేమీ ఉండదని లబ్ధిదారులకు EPFO ద్వారా సమాచారం అందించారు. పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్ లో త్వరలో వడ్డీ సొమ్మును చూసుకోవచ్చు. వడ్డీని క్రెడిట్ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఈపీఎఫ్ తెలిపింది. ర్ నవీకరణ కారణంగా, అది స్టేట్‌మెంట్‌లలో స్పష్టంగా కనిపించదు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్
భారతదేశ వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం EPFO అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ద్వారా కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ప్లాన్, ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అన్నీ నిర్వహిస్తారు. EPF ఖాతాల వడ్డీ రేటు సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో CBT నిర్ణయిస్తుంది. ఎంత వడ్డీ జమ అయిందో తెలుసుకోవాలంటే పీఎఫ్ పాస్ బుక్ చూసుకోవాలి.

EPFO బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలంటే..
పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి యూఏఎన్ నెంబరు కేటాయిస్తారు. ఈ నెంబరు ఆధారంగా పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
ముందుగా మీరు EPFS వెబ్ సైట్ లోకి వెళ్లాలి. సర్వీస్ పై క్లిక్ చేస్తే ఎంప్లాయిస్, ఎంప్లాయర్ అని వస్తుంది. మీరు ఎంప్లాయిస్ పై క్లిక్ చేయాలి. మీ యూఏఎన్ ఇప్పటికే యాక్టివేట్ చేసుకుంటే పాస్ బుక్ పై క్లిక్ చేయండి. లేకుంటే ఆన్ లైన్ సర్వీస్ పై క్లిక్ చేయాలి.

యూఏఎన్ యాక్టివ్
మీకు యాక్టివ్ యూఏఎన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానీ క్లిక్ చేయాలి అప్పుండు మీ యూఏఎన్ నెంబర్, ఆధార్ నెంబర్, పేరు, ఫోన్ నంబంర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సడ్మిట్ చేయాలి. తర్వాత మీ ఫోన్ కు పాస్ వర్డ్ వస్తుంది. యూఏఎన్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీరు పాస్ వర్డ్ మార్చుకోవాలి. పాస్ వర్డ్ మార్చుకున్న 6 గంటల తర్వాత మీరు మళ్లీ లాగిన్ అయి పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఉమంగ్ యాప్
ఉమంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ కు వెళ్లి ఉమంగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో లాగిన్ కావాలి. ఆ తర్వాత పీఎఫ్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే లాగిన్ అడుగుతుంది. మీరు యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట చేయగానే మీరు లాగిన్ అవుతారు. అప్పుడు మీరు మీ పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.