జనవరి-మార్చిలో హౌసింగ్ సేల్స్ జంప్, హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు
కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిందని రియల్ ఎస్టేట్ రంగ సంస్థ ప్రాప్‌టైగర్ వెల్లడించింది. త్రైమాసికం ప్రాతిపదికన జనవరి-మార్చి కాలంలో హౌసింగ్ సేల్స్ 12 శాతం పెరిగాయి. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాల్లో డిమాండ్ పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా హౌసింగ్ సేల్స్ పెరిగేందుకు కూడా చర్యలు తీసుకుంది. దీంతో కొనుగోలుదారుల సెంటిమెంట్ పెరిగింది. దీంతో గత కొద్ది రోజులుగా హోమ్ సేల్స్ పెరుగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం: అంతర్జాతీయ మార్కెట్లో చమురు పతనం

హౌసింగ్ సేల్స్ పెరిగాయి..
ఎనిమిది ప్రధాన మార్కెట్‌లలో (8 ముఖ్య నగరాలు) హౌసింగ్ సేల్స్ జనవరి - మార్చి త్రైమాసికంలో పెరిగాయి. ఈ మేరకు ప్రోప్ టైగర్ తన రియల్ ఇన్-సైట్ Q1CY21లో పేర్కొంది. 2021 క్యాలెండర్ ఏడాది జనవరి-మార్చి కాలంలో 66,176 ఇళ్లు సేల్ అయ్యాయి. Q1CY20తో పోలిస్తే హోమ్ సేల్స్ 5 శాతం క్షీణించాయి. త్రైమాసికం ప్రాతిపదికన మాత్రం అంటే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 12 శాతం పెరిగింది.

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు
హైదరాబాద్ నగరంలో 2020 జనవరి-మార్చిలో 5,554 ఇళ్లు, ఫ్లాట్లు విక్రయించగా, ఈ ఏడాది ఇదే సమయంలో 38 శాతం పెరిగి 7,721కు చేరాయని ప్రోప్ టైగర్ తెలిపింది. ఈ కాలంలోనే దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు 5 శాతం క్షీణించినట్లు వెల్లడించింది. ఎనిమిది పెద్ద నగరాల్లో గృహ విక్రయాల తీరుతెన్నులపై ప్రాప్ టైగర్ నివేదిక రూపొందించింది.

కొత్త లాంచింగ్స్
జనవరి-మార్చి త్రైమాసికంలో భారత్ వ్యాప్తంగా 53,037 యూనిట్లు లాంచ్ అయ్యాయి. ఏడాది ప్రాతిపదికన ఈ వృద్ధి 49 శాతంగా ఉంది. త్రైమాసికం ప్రాతిపదికన మాత్రం 2 శాతం క్షీణించాయి. కాగా, 2021 జనవరి-మార్చిలో దేశవ్యాప్తంగా 66,176 ఇళ్లు, ఫ్లాట్లు విక్రయించగా, ఏడాది క్రితం ఈ సంఖ్య 69,555గా ఉంది. అయితే ఈ ఎనిమిది నగరాల్లో అమ్మకాలు 29 శాతం పెరిగినట్లు అనరాక్ వెల్లడించింది. 44 శాతం వృద్ధి కనిపించినట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది.