For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన హౌసింగ్ సేల్స్, ఐనా 2019 కంటే తక్కువే: 2020 పైన అందుకే ఆశలు

|

2020లో ప్రారంభంలో కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్న రంగాల్లో రియల్ ఎస్టేట్ ఉంది. ఇటీవలి కాలంలో కాస్త పుంజుకున్నప్పటికీ మొత్తంగా ఈ ఏడాదిలో భారత రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్షీణించింది. మార్చి చివరి వారంలో లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సేల్స్ పూర్తిగా పడిపోయాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో కాస్త పుంజుకున్నప్పటికీ చాలా తక్కువే. అయితే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మాత్రం అమ్మకాలు పుంజుకున్నాయి. వచ్చే ఏడాది రెసిడెన్షియల్ సేల్స్ కరోనా పూర్వస్థాయికి లేదా అంతకుమించి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2020లో ఈ చిన్న స్టాక్స్ 600% వరకు రిటర్న్స్ ఇచ్చాయి2020లో ఈ చిన్న స్టాక్స్ 600% వరకు రిటర్న్స్ ఇచ్చాయి

అందుకే సేల్స్ పెరిగాయి

అందుకే సేల్స్ పెరిగాయి

2019లో మందగమనం, 2020లో కరోనా వల్ల ఆర్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. హోమ్ లోన్లపై ప్రస్తుతం అతి తక్కువ వడ్డీ రేట్లు ఉండటంతో పాటు రియాల్టర్లు సేల్ కావడం కోసం డిస్కౌంట్లు, ఆకర్షణీయ చెల్లింపు ప్రణాళికలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో డిసెంబర్ త్రైమాసికంలో సేల్స్ పెరిగాయి. కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ తగ్గించాయి. అలాగే మహమ్మారి నేపథ్యంలో ఇంటి కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పెరిగే అవకాశాలు ఉన్నాయి.

2019లో ఎన్ని, 2020లో ఎన్ని?

2019లో ఎన్ని, 2020లో ఎన్ని?

అన్‌రాక్ డేటా ప్రకారం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశంలోని ఏడు పెద్ద నగరాల్లో సేల్స్ 50,900 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 29,520గా ఉంది. అయినప్పటికీ 2020 క్యాలెండర్ ఏడాదిలో హౌసింగ్ సేల్స్ 47 శాతం వరకు క్షీణించాయి. 2019లో 2.61 లక్షల యూనిట్లు సేల్ కాగా, ఇప్పుడు 1.38 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ ఏడాది హౌసింగ్ సేల్స్ నిరాశాజనకంగా ఉన్నప్పటికీ 2021లో ఆశాజనకంగా ఉంటుందని అనరాక్ చైర్మన్ అనుజ్‌పూరి అన్నారు.

మరిన్ని చర్యలు

మరిన్ని చర్యలు

రెసిడెన్షియల్ సేల్ డిమాండ్ క్రమంగా పెరుగుతోందని టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజయ్ దత్ తెలిపారు. వడ్డీ రేట్లు తగ్గడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు డిమాండ్ పెంచడానికి దోహదపడ్డాయని ముంబైకి చెందిన కల్పతరు లిమిటెడ్ ఎండీ పరాగ్ మునోత్ అన్నారు. అయినప్పటికీ మరింత డిమాండ్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని, వడ్డీపై ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వంటి చర్యలు అవశ్యమన్నారు. కరోనా నేపథ్యంలో పొదుపు చర్యల కారణంగా 2021లో హౌసింగ్ సేల్స్ మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

English summary

పెరిగిన హౌసింగ్ సేల్స్, ఐనా 2019 కంటే తక్కువే: 2020 పైన అందుకే ఆశలు | Housing sales recover in October-December: industry expects momentum to continue

India's residential real estate market seems to have bottomed out in 2020 and sales momentum that picked up during October-December is likely to continue through the next year to reach pre-COVID level or even surpass it provided there are no further unforeseen negative events, according to top property developers and consultants.
Story first published: Thursday, December 31, 2020, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X