For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ సహా సిటీల్లో హౌసింగ్ సేల్స్ జంప్, పూర్తి ఏడాది పరంగా డౌన్

|

న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో హౌసింగ్ సేల్స్ 78 శాతం పెరిగాయి. FY20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 62,197 హౌసింగ్ యూనిట్స్ సేల్ కాగా, ఈసారి అదే సమయంలో 110,811 యూనిట్లుగా ఉన్నాయి. ఈసారి పండుగ సమయంలో సేల్స్ పెరిగాయి. 2019లో అదే కాలంతో పోలిస్తే, 2020లోను 25 శాతం పెరిగాయి. ఈ మేరకు రియల్ ఎస్టేట్ డేటా, రీసెర్చ్, అండ్ అనలటిక్స్ సంస్థ ప్రాప్-ఈక్విటీ నివేదిక వెల్లడిస్తోంది.

<strong>అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!</strong>అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!

ఢిల్లీలో మాత్రం డౌన్

ఢిల్లీలో మాత్రం డౌన్

దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే సేల్స్ 32 శాతం క్షీణించాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ఎంఎంఆర్, పుణే నగరాల్లో సేల్స్ ఏడాది ప్రాతిపదికన వరుసగా 46 శాతం, 52 శాతం, 74 శాతం, 41 శాతం, 130 శాతం, 120 శాతం పెరిగాయి. కొత్త ప్రారంభాలు 28 శాతం తగ్గి 6297 యూనిట్ల నుండి 4553 యూనిట్లకు పడిపోయాయి.

వివిధ నగరాల్లో ఇలా...

వివిధ నగరాల్లో ఇలా...

ఢిల్లీ మార్కెట్లో ఏడాది ప్రాతిపదికన 32 శాతం తగ్గాయి. 2019లో 44,894 యూనిట్లు కాగా, 2020లో 29,640 యూనిట్లుగా నమోదయ్యాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో 3 శాతం ఎగిసి 1,07,562 యూనిట్ల నుండి 1,11,256 యూనిట్లకు పెరిగాయి. కొత్త ప్రారంభాలు 56 శాతం తగ్గాయి. 62,891 యూనిట్ల నుండి 40,275 యూనిట్లకు పడిపోయాయి.

బెంగళూరులో కొత్త ప్రారంభాలు 56 శాతం పెరిగి 5,178 యూనిట్ల నుండి 8,100 యూనిట్లకు పెరిగాయి.

చెన్నైలో కొత్త ప్రారంభాలు 77 శాతంపెరిగి 1674 యూనిట్ల నుండి 2960కి పెరిగాయి.

ఎంఎంఆర్‌లో కొత్త ప్రారంభాలు 174 శాతం పెరిగి 9,381 యూనిట్ల నుండి 25,748 యూనిట్లకు పెరిగాయి.

హైదరాబాద్‌లో

హైదరాబాద్‌లో

వివిధ నగరాల్లో ఏడాది ప్రాతిపదికన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సేల్స్ పెరిగినప్పటికీ, 2019తో పోలిస్తే పూర్తి ఏడాది 2020లో తగ్గాయి. హైదరాబాద్ నగరంలో సేల్ డిమాండ్ 14 శాతం క్షీణించి 31,038 యూనిట్ల నుండి 26,716 యూనిట్లుకు పడిపోయింది. కోల్‌కతాలో 38 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో 34 శాతం పడిపోయింది.

English summary

హైదరాబాద్ సహా సిటీల్లో హౌసింగ్ సేల్స్ జంప్, పూర్తి ఏడాది పరంగా డౌన్ | Housing sales demand rises 78percent in December quarter on pent up demand

Total sales of home units in top seven cities across the country increased by 78 percent in Q4 2020 to 110,811 units versus 62,197 units in Q3 2020 on the back of pent-up demand and increased sales during the festive season.
Story first published: Thursday, January 21, 2021, 20:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X