For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

48 శాతం డౌన్: హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు: అనరాక్ రిపోర్ట్

|

దేశంలో ఏడు టాప్​ సిటీలలో ఇళ్ల అమ్మకాలు 47 శాతం తగ్గుతాయని ప్రొపర్టీ కన్సల్టెంట్​ అనరాక్​ అంచనా వేసింది. అమ్మకాలు 1.38 లక్షలకు పరిమితం అవుతాయని చెబుతోంది. కరోనా వైరస్ వల్ల డిమాండ్​ తగ్గడమే ఇందుకు కారణమని పేర్కొంది. కొత్త హౌసింగ్​ సప్లయ్​ 46 శాతం తగ్గి 1.28 లక్షల యూనిట్లకుగా నమోదవుతుందని అంచనా వేస్తోంది.

47 శాతం పడిపోయిన అమ్మకాలు

47 శాతం పడిపోయిన అమ్మకాలు

ఢిల్లీ, ముంబై మెట్రోపాలిటన్​ రీజియన్​, పుణె, బెంగళూరు, హైదరాబాద్​, చెన్నై, కోల్​కతాలో హౌసింగ్​ సేల్స్​పై కంపెనీ రిపోర్డు విడుదల చేసింది. 2019లో 2.61 లక్షల ఇళ్లు అమ్ముడవగా, కొత్త ఇళ్ల సప్లయ్​ 2.37 లక్షలుగా రికార్డయినట్లు అనరాక్​ పేర్కొంది. 2020లో రెసిడెన్షియల్​ రియల్​ ఎస్టేట్​ పడిపోయిందని తెలిపింది. అక్టోబర్​-డిసెంబర్​ క్వార్టర్లో మంచి రికవరీ కనబడుతోందని తెలిపింది. కరోనా వల్ల 2020లో రియల్​ ఎస్టేట్​ రంగంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. చివరి రెండు క్వార్టర్లలో రెసిడెన్షియల్​ డిమాండ్​ కొంత ఊపందుకుందని అనరాక్​ ఛైర్మన్​ అనుజ్ పురి చెప్పారు.

 ఎందుకు పడిపోయాయంటే..

ఎందుకు పడిపోయాయంటే..

హౌసింగ్​ లోన్స్​పై తక్కువ వడ్డీ రేటు, స్టాంప్​ డ్యూటీ కోత వంటివీ డిమాండ్​ పెరగడంలో సాయపడ్డాయని పేర్కొన్నారు. ముంబై మెట్రోపాలిటన్​ రీజియన్​లో గరిష్టంగా 44,320, బెంగళూరులో 24,910 ఇళ్లు అమ్ముడవుతాయని డేటా చెబుతోంది. 2019లో ముంబైలో 80,870 ఇళ్లు సేల్​ అయ్యాయి. 2020లో సేల్స్​ 45 శాతం తక్కువగా విక్రయాలు జరిగాయి. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు అంతకు ముందు ఏడాదిలో 50,450 నుంచి 51 శాతం తగ్గుతాయని అనరాక్​ పేర్కొంది. పుణెలో అమ్మకాలు 42 శాతం, ఢిల్లీలో 51 శాతం సేల్స్​ పడనున్నాయని తెలిపింది. హైదరాబాద్​లో 2019లో 16,590 ఇళ్లు అమ్ముడయ్యాయి. దీంతో పోలిస్తే 2020లో సేల్స్​ 48 శాతం తగ్గి 8,560కి పరిమితమవుతున్నాయని రిపోర్టు వెల్లడించింది. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 6,740 యూనిట్లకు తగ్గుతాయని పేర్కొంది.

అక్కడ 49 శాతం

అక్కడ 49 శాతం

కోల్​కతాలో సేల్స్​ తగ్గుదల 49 శాతమని వెల్లడించింది. అమ్ముడుకాని హౌసింగ్​ స్టాక్​ ఈ ఏడాది 2 శాతం తగ్గి 6,38,020 యూనిట్లకు చేరుతుందని, అంతకు ముందు ఏడాదిలో ఇది 6,48,400 యూనిట్లని అనరాక్​ రిపోర్టు తెలిపింది. కొందరు ప్రొపర్టీ కన్సల్టెంట్లు, డేటా ఎనలిటిక్స్​ ఫర్మ్స్​ క్వార్టర్లీ ప్రాతిపదికన హౌసింగ్​ మార్కెట్​ డేటాను రూపొందిస్తున్నాయి.

English summary

48 శాతం డౌన్: హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు: అనరాక్ రిపోర్ట్ | home sales 48 percent fell down in hyderabad

home sales 48 percent fell down in hyderabad anarock report revealed
Story first published: Tuesday, December 22, 2020, 14:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X