For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, వచ్చే క్వార్టర్‌లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయ్

|

వచ్చే మూడు నెలల్లో నియామకాలు పుంజుకోవచ్చునని మ్యాన్‌పవర్ ఇండియా సర్వేలో వెల్లడైంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, విద్య, సేవారంగాల్లో అధికంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నికర ఉద్యోగ కల్పన 9 శాతం మేర ఉండవచ్చు ఈ సర్వే తెలిపింది. బడ్జెట్ ప్రతిపాదనలు ఉద్యోగాల సృష్టికి అవకాశం కల్పిస్తున్నాయి. మౌలిక, ఆరోగ్య సంరక్షణ, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోందని మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులేటి అన్నారు.

నియామకాల జూమ్

నియామకాల జూమ్

ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం వెచ్చించిన నిధుల ప్రభావం సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో కనిపించవచ్చునని ఈ సర్వే అభిప్రాయపడింది. టోకు, రిటైల్ వ్యాపార రంగాల్లో నియామకాలు పరిమితంగా ఉండవచ్చునని తెలిపింది. నియామకాలపరంగా 2021 జూన్ వరకు కరోనా ముందుస్థాయికి చేరుతామని 27 శాతం కంపెనీలు వెల్లడించగా, 2021 చివరినాటికి ఆ స్థాయిని అందుకుంటామని 56 శాతం సంస్థలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 2,375 కంపెనీల యాజమాన్యాలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

వచ్చే త్రైమాసికంలో నియామకాలు

వచ్చే త్రైమాసికంలో నియామకాలు

జనవరి - మార్చి త్రైమాసికంలో 8 శాతం నియామకాలు ఉండగా, వచ్చే త్రైమాసికం నాటికి మరింత పెరుగుతాయని ఈ సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 12 శాతం చెప్పాయి. నియామకాలు తగ్గుతాయని రెండు శాతం కంపెనీలు చెప్పగా, 53 శాతం కంపెనీలు మాత్రం నియామకాల్లో మార్పు ఉండదని వెల్లడించాయి. గత త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో నియామకాలు పెరిగినట్లు తెలిపింది.

మరో సర్వేలో...

మరో సర్వేలో...

ఈ ఏడాది ప్రథమార్ధంలో అప్రెంటిస్‌లకు అవకాశాలు పెరగనున్నాయని టీమ్ లీజ్ తెలిపింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో అప్రెంటిస్ నియామకాలను పెంచే యోచనలో ఉన్నట్లు ఈ సర్వేలో పాల్గొన్న 58 శాతానికి పైగా కంపెనీలు తెలిపాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మహిళా అప్రెంటిస్‌లకు ప్రాధాన్యం 10 శాతం పెరిగిందని వెల్లడైంది.

English summary

గుడ్‌న్యూస్, వచ్చే క్వార్టర్‌లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయ్ | Hiring activity to recover in June Quarter, says ManpowerGroup Outlook Survey

Hiring Activity to Recover in June Quarter, Says ManpowerGroup Employment Outlook Survey. 12% companies intend to recruit in the June quarter. 8% of companies planned to recruit in the March quarter.
Story first published: Wednesday, March 10, 2021, 14:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X