For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు: భారీగా తగ్గిన నియామకాలు, పెరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగాలు

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో కంపెనీలు కాంట్రాక్ట్ ఉద్యోగాల వైపు చూడటం క్రమంగా పెరుగుతోందట. కంపెనీలతో పాటు ఉద్యోగులు కూడా తాత్కాలిక ఉద్యోగాల వైపు దృష్టి సారిస్తున్నారు. తక్కువ నైపుణ్యం నుండి మొదలు అత్యంత నైపుణ్యాల వరకు ఈ ధోరణి కొనసాగుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగ విధానం చాలాకాలంగా ఉన్నప్పటికీ ఇటీవల కరోనా అనంతరం గతంలో ఎన్నడూ లేనంతగా ఇది పెరుగుతోందని టీమ్‌లీజ్ వెల్లడించింది. ఇందుకు కరోనా పరిస్థితులు, దీని వల్ల వచ్చిన ఆర్థిక పరిస్థితులు కారణంగా చెబుతున్నారు. టీమ్‌లీజ్‌తో పాటు సిక్కీ టాలెంట్ కామర్స్ ప్లాట్‌ఫాం డేటా కూడా ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో హైరింగ్ యాక్టివిటీస్ తగ్గాయని, అదే సమయంలో కాంట్రాక్టువల్ జాబ్స్ పెరిగాయని తన నివేదికలో తెలిపింది.

అవసరమైతే మరోసారి.. లేదనడం లేదు: ప్యాకేజీపై నిర్మల సీతారామన్ సంకేతాలుఅవసరమైతే మరోసారి.. లేదనడం లేదు: ప్యాకేజీపై నిర్మల సీతారామన్ సంకేతాలు

వారికి డిమాండ్ పెరుగుతోంది..

వారికి డిమాండ్ పెరుగుతోంది..

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కాంట్రాక్ట్ ఉద్యోగులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని టీమ్‌లీజ్ వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ తెలిపారు. డెలివరీ ఏజెంట్లు, వేర్ హౌస్ హెల్పర్లు, అసెంబ్లీ లైన్ ఆపరేటర్లు మొదలైన ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు. ఇక వైట్ కాలర్ ఉద్యోగాలకు సంబంధించి డిజైనర్స్, కంటెంట్ రైటర్స్, డిజిటల్ మార్కెటర్లకు డిమాండ్ ఉందన్నారు. డిమాండ్‌కు తగినట్లు తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. గత ఆరు నెలల్లో ఇలాంటి ఉద్యోగుల డిమాండ్ గత ఏడాది కాలంతో పోలిస్తే రెండింతలు పెరిగిందని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చితో పోల్చినా డిమాండ్ 12 శాతం పెరిగింది.

ప్రతికూలతలు...

ప్రతికూలతలు...

కాంట్రాక్టువల్ ఉద్యోగాలు పెరిగినప్పటికీ ప్రతికూలతలు ఉన్నాయి. ఉద్యోగాలు, వేతానాల్లో స్థిరత్వం ఉండదు. వేతనాలు, పని గంటలు, ఓటీ, సెలవులకు చట్టపరమైన భద్రత ఉండదు. ఆర్థిక భద్రత తక్కువ. అయితే ఈ నిర్ణయాలవల్ల కంపెనీలపై ఆర్థిక భారం తగ్గుతుంది. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నష్టదాయకం.

30 శాతం డౌన్

30 శాతం డౌన్

దేశంలో జూన్ త్రైమాసికంలో హైరింగ్ యాక్టివిటీస్ 30 శాతం క్షీణించాయని, అదే సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగాయని సిక్కీ టాలెంట్ కామర్స్ ప్లాట్‌ఫాం నివేదిక వెల్లడిస్తోంది. 2019 సెప్టెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ 13 శాతం పెరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ 11 శాతం పెరిగింది. అదే సమయంలో శాశ్వత ఉద్యోగుల డిమాండ్ 13.8 శాతం క్షీణించింది. ఐటీ, ఐటీ సేవల రంగాల్లో జూన్ త్రైమాసికంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల రికవరీ కనిపించింది.

English summary

ఆ ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు: భారీగా తగ్గిన నియామకాలు, పెరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగాలు | Hiring activity dips 30 percent in Q2, rise in contractual jobs

The hiring activity in India saw a 30 per cent decrease in the June quarter compared to the same period last year as the country saw a rise in contractual jobs, a new report said on Tuesday.
Story first published: Tuesday, October 20, 2020, 20:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X