మెట్రో నగరాల్లో నియామకాలు, ఉద్యోగావకాశాలు పెరుగుతున్నట్లు జాబ్ పోర్టల్ సైకీ నివేదిక వెల్లడిస్తోంది. అంతకుముందు (సెప్టెంబర్) నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో ఐదు శాతానికి పైగా పెరిగిందని తెలిపింది. తమ వెబ్ సైట్లోని వివరాల మేరకు సైకీ ఈ వివరాలు తెలిపింది. కరోనా వైరస్ ప్రభావం, పండుగ సీజన్‌తో సంబంధం లేకుండా మెట్రో నగరాల్లో నియామకాలు పుంజుకుంటున్నాయని, సెప్టెంబర్ మాసంతో పోలిస్తే గత నెలలో 5.55 శాతం జాబ్ పోస్టింగ్స్ సంఖ్య పెరిగిందని సైకీ సహ వ్యవస్థాపకుడు అక్షయ్ శర్మ తెలిపారు. ఈ కామర్స్, ఫార్మా, టెలికం, బ్యాంకింగ్, బీమా, డాటా అనలిటిక్స్, ఐటీ సర్వీసెస్ తదితర రంగాలలో ఉద్యోగాలు పెరిగినట్లు పేర్కొంది.

గత ఏడాది కంటే తగ్గుదల
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశంలోని మెట్రో నగరాల్లో నియామక రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపింది. సెప్టెంబర్‌తో పోలిస్తే, అక్టోబర్ నెలలో 5 శాతం కంటే ఎక్కువగా పెరగగా, ఏడాది ప్రాతిపదికన(2019 అక్టోబర్ నెలతో) పోలిస్తే 17.6 శాతం మేర నియామక కార్యకలాపాలు తగ్గినట్లు తెలిపింది. ఈ కామర్స్, ఫార్మా, ప్యాకేజింగ్, టెలికం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, డేటా అనలిటిక్స్, ఐటీ సేవలు, పునరుత్పాదక ఇంధనంతో పాటు ఆతిథ్య రంగాల్లోను ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

ఐటీ కాంట్రాక్టు వైపు మొగ్గు
ఉద్యోగాల్లోకి తీసుకోవడం కంటే పలు కంపెనీలు కాంట్రాక్టు పద్ధతిన నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని సైకీ తెలిపింది. ప్రధానంగా ఐటీ సేవల సంస్థల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోందని వెల్లడించింది. వర్క్ ఫ్రమ్ హోం నేపథ్యంలో టెలికం రంగంలో కూడా నియామక కార్యకలాపాలు పుంజుకున్నట్లు తెలిపింది. నెలవారీగా చూస్తే ఇటీవల నియామక ప్రక్రియలు మెరుగవుతున్నాయని తెలిపింది. రాబోయే నెలల్లో మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

ఉద్యోగాలు పోయి.. ఇప్పుడు కోలుకుంటున్నాయి
కరోనా కారణంగా మార్చి చివరి వారం నుండి పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆర్థిక కార్యకలాపాల పుంజుకోవడంతో నియామకాలు కూడా పెరుగుతున్నాయి. క్రమంగా హైరింగ్ పెరుగుతోందని తెలిపింది. ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ తదితర కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications