For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.10,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్న హీరో

|

హీరో మోటోకార్ప్ రానున్న ఐదు నుండి ఏడేళ్లలో భారత్‌లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. పరిశోధన - అభివృద్ధి, కొత్త తయారీ ప్లాంట్ల ఏర్పాటుపై ఈ మొత్తాన్ని పెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు హీరో మోటోకార్ప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) పవన్ ముంజాల్ వెల్లడించారు. జపాన్‌కు చెందిన హోండా నుండి 2011లో విడివడిన హీరో.. ఆ తర్వాత ఒంటరిగా కార్యకలాపాలు ప్రారంభించింది.

అసలు విషయం చెప్పిన నిర్మల: ఆదాయపు పన్ను మినహాయింపులు క్రమంగా తగ్గింపుఅసలు విషయం చెప్పిన నిర్మల: ఆదాయపు పన్ను మినహాయింపులు క్రమంగా తగ్గింపు

ఇప్పటి వరకు 1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఆర్ అండ్ డీపై 600 మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసింది. ఇప్పుడు విజన్ 2020లో భాగంగా వచ్చే పదేళ్ల కాలంలో కాలుష్య రహిత వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అందుకే రానున్న 5 నుండి 7 ఏళ్ల మధ్య కాలంలో సుస్థిరమైన రవాణా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి రూ.10వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.

Hero to invest Rs 10,000 crore in next 5 to 7 years

2011 నుంచి ఇప్పటి వరకు కొత్త ప్లాంట్స్, యంత్రాలు, వాహనాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. 1985లో దేశీయ మార్కెట్లోకి అడుగు పెట్టిన హీరో ఈ ఏడాది చివరినాటికి 10 కోట్ల మైలురాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

BS6 గ్లామర్ విడుదల
హీరో సంస్థ దేశీయ మార్కెట్లోకి BS-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన గ్లామర్, ప్యాషన్ ప్రొ బైక్స్‌ను బుధవారం విడుదల చేసింది. వీటిలో గ్లామర్ మోటర్ సైకిల్ ఖరీదు రూ.68,900 నుంచి రూ.72,000 మధ్య ఉండగా, ఫ్యాషన్ ప్రో ధర రూ.64,990 నుండి రూ.67,190 మధ్య ఉంది. వీటితో పాటు వచ్చే నెలలో అందుబాటులోకి రానున్న ప్రీమియం బైక్ ఎక్స్‌ట్రీమ్ 160Rను ప్రదర్శించింది.

English summary

రూ.10,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్న హీరో | Hero to invest Rs 10,000 crore in next 5 to 7 years

With an objective to create the next generation of mobility soulutions, the country's largest two-wheeler maker Hero MotoCorp on Tuesday said it will invest Rs 10,000 crore over the next 5-7 years.
Story first published: Wednesday, February 19, 2020, 9:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X