For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Money making Ideas: షార్ట్ టర్మ్ కోసం సిక్స్ బెస్ట్ స్టాక్స్: స్టాప్‌లాస్‌కు చేరువగా

|

ముంబై: దేశంలో రోజురోజుకూ పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు, రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ షేర్ మార్కెట్‌లో కొంత గందరగోళానికి గురి చేస్తోన్నాయి. లాంగ్ టర్మ్‌లో ఉపయోగపడతాయని భావించిన కొన్ని బడా కంపెనీల షేర్లు కూడా అంచనాలకు విరుద్ధంగా రాణిస్తున్నాయి. టీసీఎస్ 11.2 శాతం మేర క్షీణతను రికార్డు చేసుకోవడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లోనూ కొన్ని షేర్లు మాత్రం నిలకడగా రాణిస్తోన్నాయి. షేర్ హోల్డర్లకు లాభాలను పంచుతున్నాయి. షార్ట్ టర్మ్ కోసం ఈ అయిదు షేర్లు లాభాలను పంచుతాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి

ఫ్రెషర్స్.. గెట్ రెడీ: వచ్చే ఆరునెలల్లో టీసీఎస్‌లో వేల కొద్దీ ఉద్యోగాలు

ఛార్లెట్ హోటల్స్..

ఛార్లెట్ హోటల్స్..

సాధారణంగా హోటల్స్‌కు సంబంధించిన స్టాక్స్‌కు ఢోకా ఉండబోదనే హామీ ఇన్వెస్టర్లలో ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో ఈ సెగ్మెంట్‌కు చెందిన కొన్ని షేర్లు క్షీణతను నమోదు చేసుకున్నాయి. డౌన్‌ఫాల్ అయ్యాయి. అది కొంత సమయం వరకు మాత్రమే. ఇప్పుడు మళ్లీ హోటల్స్ షేర్లకు వ్యాల్యూ పెరుగుతోంది. తాజాగా ఛార్లెట్ హోటల్స్ ట్రేడింగ్ మెరుగుపడింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఈ హోటల్ షేర్ ఒక్కింటికి 240 రూపాయల వద్ద నిలిచింది. దీని స్టాప్ లాస్ వ్యాల్యూ 220 రూపాయలు. ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు దీన్ని హోల్డ్ చేసుకోవచ్చని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి

అజంత ఫార్మా

అజంత ఫార్మా

ఈ మధ్యకాలంలో ఫార్మాసూటికల్స్ కంపెనీలకు సంబంధించిన షేర్ల ట్రేడింగ్ పుంజుకుంటోంది. అజంత ఫార్మా ట్రేడింగ్ కూడా అప్‌ట్రెండ్‌లో వచ్చింది. ఇదివరకు డౌన్ ట్రెండ్‌లో కనిపించిన షేర్లు.. అప్ ట్రెండ్ అవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం రూ.2,296.90 పైసల వద్ద ఇది ట్రేడింగ్ అయింది. సోమవారం మళ్లీ పెరుగుదల చోటు చేసుకునే అవకాశాలు లేక పోలేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. 2,600 నుంచి 2,800 రూపాయల వరకు ట్రెండ్ కావచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ కంపెనీ షేర్ స్టాప్ లాస్ 2,150 రూపాయలు. ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు దీన్ని హోల్డ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వినతి ఆర్గానిక్స్..

వినతి ఆర్గానిక్స్..

ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు వినతి ఆర్గానిక్స్ స్టాక్స్.. అప్‌ట్రెండ్ అయ్యాయి. హయ్యర్ వేల్యూమ్‌లో నిలిచింది ఇది. షార్ట్ టర్మ్ అండ్ మిడిల్ టర్మ్‌లల్లో ఈ కంపెనీ షేర్లను హోల్డ్ చేసుకోవచ్చని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. దీని స్టాప్ లాస్ వ్యాల్యూ 1,920 రూపాయలు. శుక్రవారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇది 2,111 వద్ద నిలిచింది. సోమవారం మళ్లీ ఇదే వ్యాల్యూ వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. 2,225 రూపాయల వరకు దీని షేర్ ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి.

 హీరో మోటో..ఐసీఐసీఐ

హీరో మోటో..ఐసీఐసీఐ

టాప్ టూవీలర్ మేకర్స్‌గా గుర్తింపు ఉన్న హీరో మోటో షేర్లు అప్‌ట్రెండ్ అవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ముగింపు ప్రకారం.. ఈ కంపెనీ ఒక్కో షేర్ ధర 2,842 వద్ద ట్రేడింగ్ అయింది. దీని స్టాప్ లాస్ వ్యాల్యూ 2,750 రూపాయలు. ఈ వారంలో దీని ధర 3,200 రూపాయల వరకు పెరిగే అవకాశం లేకపోలేదనేది మార్కెట్ వర్గాల అంచనా. ప్రైవేట్ సెక్టార్‌లో లార్జెస్ట్ బ్యాంక్‌గా ఉన్న ఐసీఐసీఐ షేర్ ధర శుక్రవారం నాటి ట్రేడింగ్ రూ. 703.40 పైసల వద్ద ముగిసింది. దీని స్టాప్ లాస్ వ్యాల్యూ 670 రూపాయలు. ఈ వారంలో దీని వ్యాల్యూ 780 రూపాయల వరకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి.

English summary

Money making Ideas: షార్ట్ టర్మ్ కోసం సిక్స్ బెస్ట్ స్టాక్స్: స్టాప్‌లాస్‌కు చేరువగా | Here are 5 stocks including Ajanta Pharma and Charlet hotels on analysts are bullish on for the short term

Here are 5 stocks including Ajanta Pharma and Charlet hotels on analysts are bullish on for the short term
Story first published: Saturday, October 9, 2021, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X