For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పసిడిప్రియులకు పండుగ లాంటి వార్త .. తెలుగురాష్ట్రాల్లో బంగారంధరల భారీ క్షీణత; తాజా ధరలివే!!

|

గత మూడు నాలుగు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ నేడు క్షీణించాయి. ఈరోజు బంగారం ధరల్లో భారీ క్షీణత కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 700రూపాయలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 760 రూపాయల మేర ధర తగ్గింది. ఇంత భారీగా ధర తగ్గటం పసిడి ప్రియులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

ఇక తాజాగా నేడు బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,500 రూపాయలుగా ట్రేడవుతోంది.10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61, 640 రూపాయలుగా విక్రయించ బడుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56, 650 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 790 రూపాయలుగా విక్రయించబడుతుంది.

Heavy decline in gold prices in Telugu states; these are the Latest gold Prices!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు,అనంతపురం,రాజమండ్రి, కాకినాడ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56 వేల 500 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 640 రూపాయలు వద్ద ట్రేడవుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,500 రూపాయలు కాగా, 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61 వేల 640 రూపాయలుగా ట్రేడవుతోంది. దేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మధురై కోయంబత్తూర్, సేలం, ఈ రోడ్, తిరుపూర్, తిరుచ్చి, తిరునవ్వే లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,920 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.

తమిళనాడులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62 వేల 90 రూపాయలు గా విక్రయించబడుతుంది. అంతర్జాతీయంగా ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో ఇటీవల కాలంలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక ఈ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary

పసిడిప్రియులకు పండుగ లాంటి వార్త .. తెలుగురాష్ట్రాల్లో బంగారంధరల భారీ క్షీణత; తాజా ధరలివే!! | Heavy decline in gold prices in Telugu states; these are the Latest gold Prices!!

good news for gold lovers. The prices of gold in India have dropped significantly recently. Here are the prices today..
Story first published: Saturday, May 6, 2023, 13:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X