For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC Q2 results: కళ్లు చెదిరే నెట్ ప్రాఫిట్ రికార్డ్

|

ముంబై: ప్రైవేట్ సెక్టార్‌లో అతి పెద్ద బ్యాంక్‌గా ఉంటోన్న హౌసింగ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (హెచ్‌డీఎఫ్‌సీ).. తన రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అంచనాలకు అనుగుణంగా రాణించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 17 శాతానికి పైగా నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది.

రూ.8,834 కోట్ల ప్రాఫిట్..

రూ.8,834 కోట్ల ప్రాఫిట్..

వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 17.6 శాతం మేర నెట్ ప్రాఫిట్‌ను రికార్డు చేసింది. జులై-ఆగస్టు-సెప్టెంబర్ మధ్యకాలంలో 8,834 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ ప్రాఫిట్‌ను అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోల్చుకుంటే.. నెట్ ప్రాఫిట్ మరింత మెరుగుపడింది. 2020-2021 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 7,513.1 కోట్ల రూపాయలను నమోదు చేయగా.. ఈ ఏడాది అదే కాలానికి 8,834 కోట్ల రూపాయల ప్రాఫిట్‌ను రికార్డు చేసింది.

తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే..

తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే..

మొత్తంగా ఈ రెండో త్రైమాసికంలో 38,754 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలను నిర్వహించింది. గత ఏడాది ఇదే కాలానికి నిర్వహించిన ఆర్థిక కార్యకలాపాల విలువ 36,069 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే.. రెండో త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నెట్ ప్రాఫిట్ పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-మే-జూన్ కాలానికి 7,729 కోట్ల రూపాయలు కాగా జులై-ఆగస్టు-సెప్టెంబర్ కాలానికి ఈ మొత్తం 8,834 కోట్ల రూపాయలకు చేరింది.

ఎన్పీఏ 1.35 శాతం..

ఎన్పీఏ 1.35 శాతం..

బ్యాంక్ ఆధీనంలో ఉన్న నిరర్ధక ఆస్తుల విలువ 16,346 కోట్లుగా నమోదైంది. ఇందులో 1.2 శాతం వ్యవసాయ సెగ్మెంట్‌కు చెందినవే. దీన్ని తీసి వేయగా మొత్తంగా ఉన్న నిరర్థక ఆస్తుల శాతం 1.35. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వడ్డీ చెల్లింపులు-రాబడి మధ్య తేడా పెరిగింది. వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం నెట్ ఇంటరెస్ట్ ఇన్‌కమ్ 12.1 శాతం మేర పెరిగి.. 17,684.4 కోట్ల రూపాయలకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 15,776 కోట్ల రూపాయలే. అడ్వాన్సుల చెల్లింపుల్లో 15.5 శాతం పురోభివృద్ధిని కనపరిచింది.

నాన్ ఇంటరెస్ట్ రెవెన్యూలో పురోభివృద్ది..

నాన్ ఇంటరెస్ట్ రెవెన్యూలో పురోభివృద్ది..

నాన్-ఇంటరెస్ట్ రెవెన్యూలో 29.5 శాతం పెరిగింది. 7,400.8 కోట్ల రూపాయల వద్ద నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి బ్యాంక్ రికార్డ్ చేసిన నాన్ ఇంటరెస్ట్ రెవెన్యూ 21.5 శాతంతో 6,092.5 కోట్ల రూపాయలు. కాగా బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ షేర్ వ్యాల్యూ మెరుగుపడింది. 2.86 శాతం మేర పెరిగింది. 1,685.90 పైసల వద్ద ట్రేడ్ అయింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన నేపథ్యంలో- ఈ బ్యాంక్ షేర్లు తన ర్యాలీని కొనసాగిస్తాయనే అభిప్రాయం ఉంది.

English summary

HDFC Q2 results: కళ్లు చెదిరే నెట్ ప్రాఫిట్ రికార్డ్ | HDFC Q2 results: Net profit Jumps upto17.6% to Rs 8,834 crores

HDFC Bank Q2 Result | Profit grows 17.6% to Rs 8,834 crore, net interest income rises 12%.
Story first published: Saturday, October 16, 2021, 17:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X