For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC Home Loans: బాదుడు మెుదలెట్టిన HDFC.. 10 రోజుల్లో రెండోసారి వడ్డీ రేట్ల పెంపు.. ఈ సారి ఎంతంటే..

|

HDFC Home Loans: దేశంలోనే అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ HDFC రుణాలు మళ్లీ ఖరీదైనదిగా మారాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే హోమ్ లోన్ కస్టమర్లు మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా 25 బేసిస్ పాయింట్ల మేర లోన్ రేటును పెంచేసింది. ఇవి ఈ నెల 9 నుంచి అమలులోకి వచ్చాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో హెచ్‌డిఎఫ్‌సి ఈ సమాచారాన్ని వెల్లడించింది.

రిజర్వు బ్యాంక్ నిర్ణయంతో..

రిజర్వు బ్యాంక్ నిర్ణయంతో..

మూడో సారి కూడా వరుసగా కీలక వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచేయటంతో హెచ్‌డిఎఫ్‌సి సైతం తన లోన్లపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచక తప్పటం లేదని వెల్లడించింది. ఆగష్టు 1న 25 బేసిస్ పాయింట్ల వడ్డీ పెంపును ప్రకటించిన బ్యాంక్, ఆ తర్వత తాజాగా మరో 25 బేసిస్ పాయింట్ల రేటు పెంపును ప్రకటించింది. దీంతో ఈ ఒక్క నెలలోనే వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు పెరిగి హోమ్ లోన్ వినియోగదారులకు భారాన్ని మోపాయి.

రెపో-లింక్డ్ వడ్డీ రేట్లు పెంపు ఇలా..

రెపో-లింక్డ్ వడ్డీ రేట్లు పెంపు ఇలా..

అన్ని రెపో-లింక్డ్ ఫ్లోటింగ్ లోన్‌లపై వడ్డీ రేట్లు ఇప్పటికే 1.40 శాతం పెరిగాయి. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు కారణంగా రుణాల రేట్లు ఖరీదుగా మారాయి. RBI రెపోను 0.50 శాతం పెంచటంతో.. రెండు విడతలుగా 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చిందని హెచ్‌డిఎఫ్‌సి సీనియర్ అధికారి వెల్లడించారు.

మీపై ఎంత భారం పడుతుందో తెలుసుకోండి..

మీపై ఎంత భారం పడుతుందో తెలుసుకోండి..

మీరు 20 సంవత్సరాల కాలవ్యవధితో HDFC నుంచి రూ. 50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. ఆగస్టుకు ముందు ఈ రుణంపై వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. ఈ వారంలో రెండుసార్లు వడ్డీ రేటు మొత్తం 0.50 శాతం పెరిగింది. ఈ విధంగా కొత్త వడ్డీ రేటు 8.25 శాతం అవుతుంది. గతంలో కస్టమర్ నెలవారీ ఈఎంఐ రూ.41,047 ఉండగా.. తాజా పెంపు తరువాత రూ.1556 పెరిగింది. ఈ పెంపు తరువాత కస్టమర్ చెల్లించాల్సిన ఈఎంఐ రూ.42,603కు చేరుకుంది.

మూడు నెలల్లో ఆరుసార్లు పెంపు..

మూడు నెలల్లో ఆరుసార్లు పెంపు..

పెరిగిన రేట్లు HDFC మూడు నెలల్లో ఆరోసారి రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. మే 2022 నుంచి 140 బేసిస్ పాయింట్లు లేదా 1.40 శాతం పెరిగాయి. అంతకుముందు జూన్ 9న దేశంలోని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ RPLRని 50 బేసిస్ పాయింట్లు పెంచింది. జూన్ 1న రేటు 0.5 శాతం పెరిగింది. మే 2న 5 బేసిస్ పాయింట్లు, మే 9న 0.30 శాతం పెంచారు. HDFC రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటులో ఈ తాజా పెంపు కస్టమర్లకు హోమ్ లోన్ EMI మొత్తాన్ని పెంచుతుంది.

English summary

HDFC Home Loans: బాదుడు మెుదలెట్టిన HDFC.. 10 రోజుల్లో రెండోసారి వడ్డీ రేట్ల పెంపు.. ఈ సారి ఎంతంటే.. | HDFC increased its home loan rates for 2nd time in just a week know about effect om emi payments now

HDFC increased its home loan rates for 2nd time in just a week
Story first published: Tuesday, August 9, 2022, 11:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X