For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC Dividend: షేర్ హోల్డర్లు లక్కీఛాన్స్: ఒక్కో షేర్‌పై

|

ముంబై: హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (HDFC) బ్యాంక్ యాజమాన్యం తన షేర్ హోల్డర్లకు గుడ్‌న్యూస్ వినిపించింది. కంపెనీ డివిడెండ్‌ను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2020-2021కి ఈ డివిడెండ్ వర్తిస్తుందని తెలిపింది. అదే ఆర్థిక సంవత్సరంలో తాము సాధించిన నెట్ ప్రాఫిట్‌లో కొంత మొత్తాన్ని షేర్ హోల్డర్లకు డివిడెండ్‌గా ప్రకటించినట్లు వివరించింది. డివిడెండ్ రూపంలో ఒక్కో షేర్‌పై రూ.6.50 పైసల మొత్తాన్ని డివిడెండ్‌గా చెల్లిస్తామని స్పష్టం చేసింది.

Paytm: బిగ్ టార్గెట్: ఈక్విటీ ద్వారా వేల కోట్ల సేకరణ: ఐపీఓకు ముహూర్తం ఫిక్స్Paytm: బిగ్ టార్గెట్: ఈక్విటీ ద్వారా వేల కోట్ల సేకరణ: ఐపీఓకు ముహూర్తం ఫిక్స్

దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించినట్లు తెలిపింది. త్వరలో నిర్వహించబోయే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ముందు ఈ ప్రతిపాదనలను తీసుకొస్తామని పేర్కొంది. ఏజీఎం ఆమోదించిన వెంటనే డివిడెండ్ చెల్లింపులు ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీ నుంచి ఈ చెల్లింపుల ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

HDFC Bank board has declared a dividend of Rs 6.50 per share for the year ended March 2021

కాగా- వచ్చే నెల 17వ తేదీన ఈ ఏజీఎం భేటీ వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఏర్పాటు కానుంది. ఇందులో వచ్చే ప్రతిపాదనల్లో డివిడెండ్ చెల్లింపులకు సంబంధించిన అంశమే ప్రధాన అజెండాగా ఉంటుందని తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు మరో ఇండిపెండెంట్ డైరెక్టర్‌ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉమేష్ చంద్ర సారంగి.. పునర్నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆయన బోర్డులో కొనసాగుతారు.

దీనితోపాటు 2023-2024 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ ఆడిట్లను పరిశీలించడానికి ఎంఎం నిస్సామ్ అండ్ కంపెనీ ఎల్ఎల్‌పీ ఛార్టెండ్ అకౌంటెంట్ ఫర్మ్‌ను నియమించుకుంది. మూడళ్ల పాటు ఈ కంపెనీ హెచ్‌‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆడిట్లను పరిశీలిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు రిజర్వు బ్యాంక్ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆడిట్ కంపెనీగా ఎంఎస్‌కేఏ అండ్ అసోసియేట్స్ వ్యవహరిస్తోంది. 15 వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను కలిగిన బ్యాంకులన్నీ రెండు చట్టబద్ధమైన ఆడిట్ కంపెనీలను కలిగి ఉండాలి.

English summary

HDFC Dividend: షేర్ హోల్డర్లు లక్కీఛాన్స్: ఒక్కో షేర్‌పై | HDFC Bank board has declared a dividend of Rs 6.50 per share for the year ended March 2021

HDFC Bank on Friday said its board has declared a dividend of Rs 6.50 per share for the year ended March 2021.
Story first published: Saturday, June 19, 2021, 12:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X