For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నకిలీ ప్రకటన: ఓఎల్ఎక్స్, క్విక్కర్‍‌లో రిలయన్స్, జియో యాడ్స్ బంద్!

|

ఓఎల్ఎక్స్, క్విక్కర్‌లు తమ వెబ్‌సైట్లలో రిలయన్స్ జియో పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు పొందుపరచడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలు సరికాదని ఆదేశించింది. జియో జాబ్స్, రిలయన్స్ ట్రెండ్ జాబ్స్ అనే వర్డ్స్ ఉపయోగిస్తూ నకిలీ ప్రకటనలు ఇవ్వడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ప్రతిష్ట, గుడ్‌విల్ దెబ్బతింటాయని రిలయన్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఉద్యోగాల పేరుతో తమకు హాని కలిగించేలా వ్యవహరిస్తున్నాయని రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.

COVID 19: వచ్చే ఏడాదికి ఇండియా పరుగు, ఎందుకంటే: దువ్వూరిCOVID 19: వచ్చే ఏడాదికి ఇండియా పరుగు, ఎందుకంటే: దువ్వూరి

కేసులో రిలయన్స్‌కు అనుకూలంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున మధ్యంతర నిషేధం విధించింది. రిలయన్స్, జియో పేరిట ఎలాంటి ప్రకటనలు జారీ చేయకుండా నిరోధించింది. మధ్యంతర ఉత్తర్వులు కల్పించని పక్షంలో రిలయన్స్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని జస్టిస్ ముక్తా గుప్తా రెండు వేర్వేరు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి విచారణ తేదీ వరకు ప్రతివాది, దాని ఏజెంట్లు, సర్వెంట్స్, అనుబంధ సంస్థలు రిలయన్స్, జియో ప్రకటనలు ఉండకూడదని తెలిపింది న్యాయస్థానం.

HD restrains Quikr, Olx from posting fake Reliance job ads on Web portals

ఈ వెబ్ పోర్టల్స్‌లో నకిలీ, మోసపూరిత ప్రకటనల వల్ల అమాయక ఉద్యోగార్థులు ఉద్యోగాల కోసం వీటి ద్వారా ఆకర్షితులై మోసపోతారని, అప్పుడు రిలయన్స్, జియో ప్రతిష్ట దెబ్బతింటుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇలాంటి ప్రకటన వల్ల ఇద్దరు ఉద్యోగులు మోసపోయినట్లు కూడా పేర్కొంది. ఇద్దరు వ్యక్తులు ఈ ప్రకటనలు చూసి దరఖాస్తు చేసుకున్నారని, ఇందుకు వారికి ఫీజు చెల్లించారని, ఆఫర్ లెటర్స్ కూడా వచ్చాయని, కానీ విచారణలో అవి నకిలీవి అని గుర్తించినట్లు తెలిపారు.

English summary

నకిలీ ప్రకటన: ఓఎల్ఎక్స్, క్విక్కర్‍‌లో రిలయన్స్, జియో యాడ్స్ బంద్! | HD restrains Quikr, Olx from posting fake Reliance job ads on Web portals

The Delhi High Court has granted Reliance Industries Limited (RIL) an interim injunction against Quikr and OLX India and restrained them from publishing any ads containing the name Reliance or Jio.
Story first published: Friday, May 29, 2020, 19:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X