For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు హెచ్‌సీఎల్ బంపరాఫర్: రూ.700 కోట్లకు పైగా స్పెషల్ బోనస్: ఎందుకో తెలుసా?

|

ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. తన సంస్థ ఉద్యోగులకు వందల కోట్ల రూపాయల మేర వన్‌టైమ్ బోనస్‌ను ప్రకటించింది. దీని విలువ 700 కోట్ల రూపాయలకు పైమాటే. ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్‌కు అదనంగా దీన్ని స్పెషల్‌గా ప్రకటించినట్లు మార్కెట్ వర్గాలు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నెలకు సంబంధించిన వేతనంతో కలిపి ఈ స్పెషల్ బోనస్‌ను ఉద్యోగులకు చెల్లించబోతోంది. అంటే- మార్చినెల వేతనంలో అదనపు బోనస్ మొత్తాన్ని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులు పొందనున్నారు.

ఇన్ని వందల కోట్ల రూపాయల మేర స్పెషల్ బోనస్‌ను ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించడానికి కారణం.. టార్గెట్‌ను అందుకోవడమే. 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆ సంస్థ ఆర్జించింది. దేశీయ కరెన్సీతో పోల్చుకుంటే.. దీని విలువ 72,800 కోట్ల రూపాయలు. ఈ మైల్ ప్టోన్‌ను అందుకున్నందు వల్ల ఉద్యోగులకు స్పెషల్ వన్‌‌టైమ్ బోనస్‌ను ప్రకటించినట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మానవ వనరుల విభాగాధిపతి అప్పారావు వీవీ తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

HCL Technologies declares one-time bonus worth over Rs 700 crore for staff

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన ఈబీఐటీ (ఎర్నింగ్స్ బిఫోర్ ఇంటరెస్ట్ అండ్ ట్యాక్సెస్) అనుగుణంగా కొన్ని దేశాల్లో సంస్థ ఆదాయం 90 మిలియన్ డాలర్లకు పైగా నమోదైందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉండే తమ సంస్థ ఉద్యోగులకు ఈ స్పెషల్ వన్‌టైమ్ బోనస్ వర్తిస్తుందని అప్పారావు చెప్పారు. ఈ ప్రత్యేక బోనస్.. ఒక్కో ఉద్యోగి 10 రోజుల వేతనంతో సమానమని తన ప్రకటనలో పేర్కొన్నారు.

10 బిలియన్ డాలర్ల రెవెన్యూను సాధించాలని తాము లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీన్ని అందుకునే క్రమంలో ఉద్యోగుల శ్రమను తాము గుర్తింాచమని అన్నారు. అందుకే రూ.700 కోట్ల రూపాయలకు పైగా స్పెషల్ బోనస్‌ను అందజేస్తున్నామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 1,59,000లకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇందులో మెజారిటీ ఎంప్లాయిస్ భారత్‌లోనే ఉన్నట్లు ఓ అంచనా. అన్ని స్థాయిల్లో పనిచేసే ఉద్యోగుల సమష్టి కృషి వల్లే 10 బిలియన్ డాలర్ల రెవెన్యూను ఆ సంస్థ అందుకుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

English summary

ఉద్యోగులకు హెచ్‌సీఎల్ బంపరాఫర్: రూ.700 కోట్లకు పైగా స్పెషల్ బోనస్: ఎందుకో తెలుసా? | HCL Technologies declares one-time bonus worth over Rs 700 crore for staff

HCL Technologies on Monday announced a special one-time bonus worth over Rs 700 crore for its employees, as the IT giant marked USD 10 billion (about Rs 72,800 crore) revenue milestone.
Story first published: Monday, February 8, 2021, 14:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X