For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HCL టెక్ లాభంలో 24% వృద్ధి: ఉద్యోగాలిస్తాం.. 15,000 మందికి గుడ్‌న్యూస్

|

ఇండియా ఐదో అతిపెద్ద ఐటీ కంపెనీ HCL టెక్నాలజీస్ మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. రూ.3,154 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.2,568 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు సంస్థ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. కరోనా కారణంగా స్వల్పకాలంలో కస్టమర్ల నుంచి కొత్త ప్రాజెక్టుల వాయిదా వంటి సవాళ్లు ఎదురు కావొచ్చునని అభిప్రాయపడింది.

COVID 19: ప్రతి ముగ్గురి ప్రొఫెషనల్స్‌లో ఒకరి ఆదాయం తగ్గింది, 6 నెలలు ఇబ్బంది కానీ...COVID 19: ప్రతి ముగ్గురి ప్రొఫెషనల్స్‌లో ఒకరి ఆదాయం తగ్గింది, 6 నెలలు ఇబ్బంది కానీ...

కరోనా వల్ల వీటిపై ప్రభావం ఎక్కువ

కరోనా వల్ల వీటిపై ప్రభావం ఎక్కువ

2019-20 జనవరి - మార్చి క్వార్టర్‌లో ఆదాయం రూ.18,587 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం నాటి ఆదాయం రూ.15,990తో పోలిస్తే 16.3 శాతం గరిష్టం. భవిష్యత్తులో బిల్లింగ్‌కు సంబంధించి ఛార్జీలలో రాయితీలు, చెల్లింపుల గడువు పెంపుతో పాటు వ్యయాలను కస్టమర్లు వాయిదా వేయడం, కొత్త ప్రాజెక్టుల మందగమనం వంటి సవాళ్లు ఉండవచ్చునని కంపెనీ సీఈవో విజయ్ కుమార్ తెలిపారు. ఆటో, ఎయిర్ లైన్స్, వినోదం, నిత్యావసరేతర రిటైల్ రంగాలపై కరోనా ప్రభావం భారీగా పడిందన్నారు. టెలికం, వృత్తి నైపుణ్య సేవల వంటి విభాగాలపై ప్రభావం తక్కువ పడినట్లు చెప్పారు. తమ పోర్ట్‌పోలియోలో టెక్నాలజీ, జీవ శాశ్త్ర విభాగాలు ఉండగా వీటిపై ప్రభావం తక్కువ ఉందన్నారు.

మధ్యంతర డివిడెండ్

మధ్యంతర డివిడెండ్

2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ వాటాదార్లకు 1:1 బోనస్ షేరును ప్రకటించింది. రూ.2 మధ్యంతర డివిడెండ్ కూడా ప్రతిపాదించింది. కరోనా కారణంగా స్వల్పకాలంపాటు ఐటీ రంగం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలిపింది. క్లయింట్స్ కొత్త ప్రాజెక్టులు విభేదించడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, లాభాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలు ప్రకటించడం లేదని తెలిపింది. సమీప, దీర్ఘకాలంలో బలమైన పనితీరునే ప్రదర్శిస్తామని ధీమా వ్యక్తం చేసింది.

15,000 కొత్త ఉద్యోగాలు

15,000 కొత్త ఉద్యోగాలు

ఈ ఏడాది ఉద్యోగ నియామకాలు నిలిపివేస్తున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి విభాగాల్లో నియామకాలు కొనసాగిస్తామని, ఇప్పటికే ఆఫర్ లెటర్ ఇచ్చిన 15 వేల మందిని తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఈ ఏడాది వేతనాల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఈవో విజయ్ కుమార్ తెలిపారు. కంపెనీ జూలై సైకిల్‌ను అనుసరిస్తుండటం వల్ల ప్రస్తుతానికి వేతన పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కంపెనీలో మార్చి క్వార్టర్ చివరి నాటికి 1,50,423 మంది ఉద్యోగులు ఉన్నారు. నాలుగో క్వార్టర్‌లో 1,250 మంది కొత్తగా చేరారు. వలసల రేటు 16.3 శాతంగా ఉంది.

రొటేషన్ పద్ధతిలో 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్

రొటేషన్ పద్ధతిలో 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్

రాబోయే 12-18 నెలల పాటు తమ కంపెనీకి చెందిన 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తారని తెలిపారు. 50 శాతం మంది మాత్రమే ఆఫీస్‌కు వస్తారని తెలిపారు. రొటేషన్ పద్ధతిలో దీనిని అమలు చేస్తామన్నారు. ఇక, 2019-20 ఆర్థిక సంవత్సరంలో HCL టెక్ నికర లాభం 9.3 శాతం పెరిగి రూ.11,057 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రకారం ఆదాయ వృద్ధి 16.7 శాతం నమోదయింది. అంచనాకు అనుగుణంగానే ఇది నమోదయింది. ఏకీకృత నికర లాభం 9.3 శాతం పెరిగి రూ.11,062 కోట్లకు, ఆదాయం 17 శాతం పెరిగి రూ.70,678 కోట్లకు చేరుకుంది. గత ఏడాదిలో 53 ఒప్పందాలపై సంతకాలు చేశారు.

English summary

HCL టెక్ లాభంలో 24% వృద్ధి: ఉద్యోగాలిస్తాం.. 15,000 మందికి గుడ్‌న్యూస్ | HCL Tech Q4 results: profit jumps 23%, To hire 15,000 freshers in 2020

IT firm HCL Technologies on Thursday reported a 22.8 per cent year-on-year (YoY) rise in consolidated net profit at Rs 3,154 crore compared with Rs 2,568 crore in the same quarter last year.
Story first published: Friday, May 8, 2020, 7:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X