For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్1బీ వీసా నిబంధనలు: హెచ్‌సీఎల్ టెక్ అమెరికన్ల కంటే తక్కువ వేతనాలు

|

HCL టెక్నాలజీస్ గత కొన్నేళ్లుగా ఎకనమిక్ పాలసీని ఉల్లంఘిస్తూ H1B వీసా ద్వారా పని చేస్తున్న ఉద్యోగులకు 95 మిలియన్ డాలర్లను మాత్రమే చెల్లిస్తోందని ఎకనమిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ (EPI) నివేదిక తెలిపింది. అమెరికాలో H1B వీసా కింద పని చేస్తోన్న ఉద్యోగులకు అమెరికన్ల కంటే తక్కువ వేతనాలు చెల్లిస్తోందని ఈ ప్రజావేగు సంస్థ ఆరోపించింది. ప్రతి సంవత్సరం అమెరికాలో H1B వీసా పొందుతున్న భారత్‌లోని మూడు అతిపెద్ద ఐటీ కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్ ఒకటి. గత ఏడాది H1B వీసాల్లో ఈ ఐటీ దిగ్గజం ఎనిమిదో స్థానంలో ఉంది. 1405 కొత్త వీసాలు జారీ చేసింది. 2801 వీసాలు రెన్యూవల్ పొందింది. 2009 నుండి హెచ్‌సీఎల్ టెక్ ఇప్పటి వరకు 31,000 H1B వీసాలను పొందింది.

డిస్నీ, ఫెడ్ఎక్స్, గూగుల్ సహా ప్రసిద్ధ కంపెనీల్లో సబ్‌కాంట్రాక్టర్లుగా పని చేస్తోన్న, నైపుణ్యం కలిగిన హెచ్1బీ వీసాదారులకు తక్కువ మొత్తం 95 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోందని ఈపీఐ ప్రతినిధులు రోన్ హిరా, డానియల్ కోస్టా తమ నివేదికలో తెలిపారు. బాధితుల్లో హెచ్1బీ వర్కర్లు మాత్రమే కాదని, అమెరికన్ వర్కర్లు కూడా ఉన్నారని, అమెరికన్ వర్కర్లకు స్థానభ్రంశం కల్పించడం లేదా వారిని తక్కువ వేతనాలకు పని చేస్తోన్న వలస కార్మికులతో కలిపేయడం కానీ చేస్తున్నారన్నారు.

 HCL Tech evading H1-B visa rules in the US

ఉదాహ‌ర‌ణ‌కు ఒరాకిల్‌లో ప‌నిచేస్తోన్న హెచ్1బీ వీసా నిపుణులు 55 వేల డాల‌ర్లు మాత్ర‌మే పొందుతున్నారని, ఇది అమెరిక‌న్ వ‌ర్క‌ర్ల కంటే త‌క్కువ‌ అని తెలిపారు. ఇది పూర్తిగా హెచ్1బీ ప్రోగ్రామ్ నిబంధ‌న‌ల‌ను పూర్తిగా ఉల్లంఘించ‌డ‌మేన‌నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ స్పందించవలసి ఉంది. చ‌ట్టాల‌కు లోబ‌డి ఉద్యోగులంద‌రికీ వేత‌నాలు చెల్లిస్తున్నామన్నారు.

English summary

హెచ్1బీ వీసా నిబంధనలు: హెచ్‌సీఎల్ టెక్ అమెరికన్ల కంటే తక్కువ వేతనాలు | HCL Tech evading H1-B visa rules in the US

Noida-based IT services firm HCL Technologies Ltd has been evading H1-B visa rules in the US, according to a report by Economic Policy Institute (EPI).
Story first published: Tuesday, December 14, 2021, 8:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X