For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HCL Tech: లాభాల రుచి చూపిస్తున్న లేజీ బాస్.. వామ్మో.. రోజూ కోట్లలో ఆదాయం..

|

HCL Tech: దేశంలోని టెక్ కంపెనీలు ఇటీవల తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా టెక్ జెయిండ్ హెచ్సీఎల్ సైతం మంచి లాభాలను నమోదు చేసింది. ఈ ఫలితాలు కంపెనీ ఉద్యోగులకు మాత్రమే కాక.. ఈక్విటీ ఇన్వెస్టర్లకు సైతం చాలా కీలకమైన సందేశాన్ని అందించాయి.

రోషిణి నాడార్..

రోషిణి నాడార్..

ప్రస్తుతం దేశంలో అగ్ర ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సీఎల్ కంపెనీని రోషిణి నాడార్ నాయకత్వం వహిస్తున్నారు. హెచ్‌సీఎల్ కూడా లాభాలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ రోషిణి నాయకత్వంలో సెంబర్ త్రైమాసికానికి 20 శాతం అధిక లాభాలను నమోదు చేసింది.

HCL టెక్..

HCL టెక్..

డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ దాదాపు రూ.4,096 కోట్ల లాభాలను ఆర్జించింది. అంటే 90 రోజుల కాలంలో రోజుకు కంపెనీ సగటున రూ.45 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

అంటే డిసెంబర్ త్రైమాసికంలో 90 రోజుల్లో రోజుకు రూ.45 కోట్ల లాభాలను ఆర్జించింది.

శివ నాడార్

శివ నాడార్

2021లో, హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన ఛైర్మన్ పదవి నుండి వైదొలిగి, వ్యూహాత్మక సలహాదారుగా మరియు హెచ్‌సిఎల్ మేనేజ్‌మెంట్ ఛైర్మన్ ఎమెరిటస్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీంతో హెచ్‌సీఎల్‌ యాజమాన్యం మొత్తం శివనాడార్‌ ఏకైక కుమార్తె రోషిణి నాడార్‌ చేతుల్లోకి వచ్చింది.

రోషిణి నాడార్

రోషిణి నాడార్

రోషిణి నాడార్ నిర్వహణలో, HC అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. కొన్ని నెలల క్రితం మార్కెట్ వాల్యుయేషన్ స్కేల్‌లో విప్రోను అధిగమించి 3వ స్థానానికి చేరుకుంది. హెచ్‌సీఎల్ డిసెంబర్ త్రైమాసికంలో అత్యధిక ఉద్యోగులను నియమించుకుంది. లాభాల పరంగానే కాకుండా టాప్ 4 కంపెనీలలో ఒకటిగా ముందుకు సాగుతోంది.

TCS-విప్రో..

TCS-విప్రో..

TCS సెప్టెంబర్ త్రైమాసికంలో 9,840 మంది ఉద్యోగులను నియమించుకోగా.. డిసెంబర్ త్రైమాసికంలో 2,197 మందిని తగ్గించింది. ఇదే క్రమంలో విప్రో ఉద్యోగుల సంఖ్య డిసెంబర్ త్రైమాసికంలో 435 తగ్గి 258,744కి చేరుకోగా.. సెప్టెంబర్ త్రైమాసికంలో కేవలం 605 మంది ఉద్యోగులు మాత్రమే చేరడం గమనార్హం.

ఇన్ఫోసిస్..

ఇన్ఫోసిస్..

ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికంలో 1,627 మంది ఉద్యోగులను మాత్రమే కొత్తగా నియమించుకుంది. మొదటి త్రైమాసికంలో మొత్తం 21,171 మందిని, రెండవ త్రైమాసికంలో 10,032 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో ఇన్ఫోసిస్‌లో కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగుల సంఖ్య 84 శాతం పడిపోయింది. అలాగే HCL కంపెనీ డిసెంబర్ త్రైమాసికంలో అస్థిర ఆర్థిక వాతావరణం ఉన్నప్పటికీ.. డిసెంబర్ త్రైమాసికంలో 2,945 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుంది.

Read more about: hcl hcl results stockmarket it news
English summary

HCL Tech: లాభాల రుచి చూపిస్తున్న లేజీ బాస్.. వామ్మో.. రోజూ కోట్లలో ఆదాయం.. | HCL Tech earned 45 crore rupees daily in december quarter amid uncertinities

HCL Tech earned 45 crore rupees daily in december quarter amid uncertinities
Story first published: Tuesday, January 17, 2023, 15:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X