For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్యోగులకు HCL టెక్ గుడ్‌న్యూస్, వారికి 30 శాతం వేతన పెంపు

|

బెంగళూరు: HCL టెక్నాలజీస్ తన 16,000 మంది ఉద్యోగులకు స్కిల్ ఆధారిత అలవెన్స్‌ను 25 శాతం నుండి 30 శాతం పెంచనున్నట్లు తెలిపింది. కస్టమర్ల ప్రీమియం చెల్లింపు ప్రయోజనాలు ఉద్యోగులకు అందిస్తున్నట్లు తెలిపింది. గత కొన్నేళ్లుగా ఈ అలవెన్స్ కోసం అర్హత సాధించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ స్కిల్ ఆధారిత అలవెన్స్‌ను మూడేళ్ల క్రితం ప్రారంభించింది.

18 నెలల డేటా ఆధారంగా స్కిల్ ఆధారిత అలవెన్స్ ఇస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ FY22లో 20,000 కొత్త నియామకాలు చేపట్టనున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇదే కాలంలో 14500 మందిని తీసుకున్నది. వివిధ ప్రాంతాల నుండి 17000 నియామకాలకు డిమాండ్ ఉందని, ఈ ఏడాది 20వేల మందిని తీసుకునే అవకాశాలు ఉన్నాయని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ అప్పారావు వీవీ అన్నారు.

HCL pays 16k staffers up to 30 percent of salary as skill perk

మార్చి 31వ తేదీతో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొత్తగా 18,554 మంది ఉద్యోగులను తీసుకుంది. తద్వారా మొత్తం ఉద్యోగులు 1,68,977 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆట్రిషన్ అంతకుముందు ఏడాది 16 శాతం ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో 9.9 శాతానికి తగ్గింది.

English summary

ఉద్యోగులకు HCL టెక్ గుడ్‌న్యూస్, వారికి 30 శాతం వేతన పెంపు | HCL pays 16k staffers up to 30 percent of salary as skill perk

HCL Technologies has offered a skill-based allowance of 25-30% of their CTC (cost-to-company) to about 16,000 employees.
Story first published: Monday, April 26, 2021, 13:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X