For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HCL Tech salary hike: కొత్తవారికి శుభవార్త, ప్యాకేజీ అదుర్స్

|

భారత ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశీయ ఐటీ రంగంలో దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఫ్రెషర్ల వార్షిక వేతనాలు పెరగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా ఐటీ సంస్థలు వార్షిక ప్యాకేజీని పదిహేను శాతం నుండి 60 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

కరోనా సంక్షోభంతో ఐటీ సేవలకు డిమాండ్ పెరిగి సాఫ్టువేర్ ఆట్రిషన్ కూడా భారీగా పెరిగింది. దీంతో కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉద్యోగులు చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే, ఫ్రెషర్స్‌ను కూడా తీసుకుంటున్నాయి. నిపుణుల వేటలో భాగంగా ఫ్రెషర్లకు కూడా ఈ ఏఢాది నుండి అధిక ప్యాకేజీని ఆఫర్ చేస్తున్నాయి.

HCL hikes salary packages for freshers

ప్రస్తుతం ఐటీ రంగంలోని పెద్ద కంపెనీలు కొత్తవారికి రూ.3.50 లక్షల నుండి ప్యాకేజీని అందిస్తున్నాయి. ఈ ఏడాది నుండి ఎంట్రీ లెవల్ ఉద్యోగుల వార్షిక వేతనాన్ని రూ.4.25 లక్షలకు పెంచినట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. డేటా అనలటిక్స్, డిజిటల్ కంటెంట్ వంటి ఆధునిక కోర్సల కోసం పలు ఇంజినీరింగ్ కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగిందని, ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసే విద్యార్థులను రూ.6 లక్షల వార్షిక ప్యాకేజీతో కంపెనీలో చేర్చుకోనున్నట్లు తెలిపారు.

English summary

HCL Tech salary hike: కొత్తవారికి శుభవార్త, ప్యాకేజీ అదుర్స్ | HCL hikes salary packages for freshers

Along with this, the IT major also introduced comprehensive increment plans for the entry level during the previous fiscal year (FY22), according to their chief human resources officer VV Apparao.
Story first published: Sunday, April 24, 2022, 14:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X