For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు తెలుసా, 3.75 కోట్ల మంది పూర్తి చేశారు, డిసెంబర్ 31 వస్తోంది..: గుర్తు చేసిన ఐటీ శాఖ

|

ముంబై: డిసెంబర్ 21వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 3.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇన్‌‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ మంగళవారం తెలిపింది. మిగిలిన వారు కూడా తమ రిటర్న్స్ దాఖలు చేయాలని సూచించింది. 'మీకు తెలుసా, 2020-21 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఇప్పటికే 3.75 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. మీరు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇప్పటికీ చేయకుంటే ఇప్పుడే చేయండి' అని ఐటీ డిపార్టుమెంట్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది.

భారీ నష్టాల నుండి లాభాల్లోకి, సెన్సెక్స్ 894 పాయింట్లు జంప్: ఐటీ స్టాక్స్ అదుర్స్భారీ నష్టాల నుండి లాభాల్లోకి, సెన్సెక్స్ 894 పాయింట్లు జంప్: ఐటీ స్టాక్స్ అదుర్స్

గడువు పొడిగింపు..

గడువు పొడిగింపు..

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దాదాపు రెండు నెలల క్రితం ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది. 2019-20(అసెస్‌మెంట్ ఇయర్ 2020-21) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు తేదీని డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు సీబీడీటీ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు ట్యాక్స్ పేయర్స్ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) గడువును పొడిగించిందని ఆదాయపు పన్ను శాఖ అప్పుడు పేర్కొంది. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్ ఫైలింగ్ తేదీ గడువును జనవరి 31, 2021 వరకు పొడిగించింది.

పలుమార్లు ఊరట

పలుమార్లు ఊరట

వైరస్ నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీని ఆర్థికమంత్రిత్వశాఖ పలుమార్లు పొడిగించింది. మొదటిసారి నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ మే నెలలో ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ నెలలో డిసెంబర్ చివరి వరకు పొడిగింపు ఇచ్చారు.

ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక

ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక

రీఫండ్‌కు సంబంధించి ఫేక్ సందేశాల పట్ల ట్యాక్స్ పేయర్స్ అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. ఐటీ డిపార్టుమెంట్స్ ఫిషింగ్ సందేశాలు ఐటీ డిపార్టుమెంట్ పంపించదని స్పష్టం చేసింది. ఏదైనా ఈ-ఫైలింగ్ అకౌంట్‌లోకి లాగిన్ కావడం ద్వారా ఉండాలని, అవాంఛిత ఈమెయిల్స్, లింక్స్, ఫామ్స్‌ను క్లిక్ చేయవద్దన్నారు.

English summary

మీకు తెలుసా, 3.75 కోట్ల మంది పూర్తి చేశారు, డిసెంబర్ 31 వస్తోంది..: గుర్తు చేసిన ఐటీ శాఖ | Have you filed yours Income Tax Returns?

Do you know that 3.75 crore taxpayers have already filed their Income Tax Returns for AY 2020-21 till 21st December, 2020? Have you filed yours yet? If not, File NOW!
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X