For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలకు సలాం: ఆ విషయంలో యూఎస్, యూకేలతో పాటు భారతీయ పురుషులను దాటేశారుగా!!

|

భారతీయ మహిళలలు కంపెనీలలో పురుషులతో పోలిస్తే బాగా రాణిస్తున్నారు. భారతదేశంలోని మహిళలు వృద్ధి అవకాశాల కోసం చూస్తున్నారని, కంపెనీలో మరింత బాధ్యత వహించాలని, వారు పురోగమనం కోరుకుంటున్నారని ప్రపంచ అధ్యయనం వెల్లడించింది. హెచ్పీ ఐఎన్సీ చేసిన అధ్యయనం ప్రకారం, భారత దేశ మహిళా ఉద్యోగులు గత ఏడాది 92 శాతం మంది ప్రమోషన్ లను పొందారని పేర్కొంది. యూఎస్ మరియు యూకే నుండి వరుసగా 40 శాతం మరియు 63 శాతంతో పోలిస్తే భారతదేశంలో 92 శాతం మంది మహిళలు ప్రమోషన్ లను పొందారని అధ్యయనం ధ్రువీకరించింది.

భారతీయ ఉద్యోగులలో పురుషులకంటే మహిళలకే ఎక్కువ ప్రమోషన్లు

భారతీయ ఉద్యోగులలో పురుషులకంటే మహిళలకే ఎక్కువ ప్రమోషన్లు

ఆసక్తికరమైన విషయమేమిటంటే, గత సంవత్సరం కేవలం 68 శాతం మంది పురుషులు మాత్రమే ప్రమోషన్‌లను పొందడంతో భారతీయ మహిళలు పురుషులను సైతం అధిగమించి ముందు వరుసలో ఉన్నట్లు తేలింది. భారతదేశం నుండి మహిళా ఉద్యోగులు అధిక జీతం కోసం మాత్రమే కాకుండా, మరింత బాధ్యత వహించడం ద్వారా మరియు కంపెనీని ప్రభావితం చేసే పెద్ద నిర్ణయాలలో భాగం కావడం ద్వారా తమ కంపెనీలో మరింత ప్రభావాన్ని పొందేందుకు కూడా ప్రమోషన్‌ను కోరుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది.

హైబ్రిడ్ వర్క్ మోడల్ మహిళలకు ప్రయోజనకరంగా ఉందని భావన

హైబ్రిడ్ వర్క్ మోడల్ మహిళలకు ప్రయోజనకరంగా ఉందని భావన

71 శాతం మంది భారతీయ మహిళలు గతంలో కంటే లింగ వివక్షను ఎదుర్కోవడంలో కంపెనీలు మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నాయని బలంగా భావిస్తున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి. చాలా మంది ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ మోడల్ మహిళలకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతున్నట్టు పేర్కొంది. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా సమయం, పని చేయడంలో సౌలభ్యం రెండింటినీ అనుమతిస్తుందని పేర్కొంది. భారతదేశంలో, ఇప్పటి జనరేషన్ జెడ్ 41 శాతం మరియు 1981 మరియు 1996 మధ్య జన్మించిన మిలీనియల్స్ 36 శాతం హైబ్రిడ్‌ను అత్యంత అనుకూలమైన వర్క్ మోడల్‌గా ఇష్టపడతారని అధ్యయనం తెలిపింది.

 ఉద్యోగాలు వదులుకునేది అందుకే...

ఉద్యోగాలు వదులుకునేది అందుకే...

ఉద్యోగం నుంచి నిష్క్రమించాలని భావించే భారతదేశంలోని 3 మంది ఉద్యోగులలో ఒకరు మెరుగైన పని-జీవిత సమతుల్యతను, మరింత స్వయంప్రతిపత్తిని మరియు అధిక జీతాలను కోరుకోవడం ప్రధాన కారణాలుగా ఉద్యోగాలను వదులుకున్నట్టు తెలుస్తుంది . చాలా మంది గ్లోబల్ కంపెనీలు ఉద్యోగుల నిలుపుదల కోసం అధిక వేతనాలను అందించడానికి సిద్ధంగా ఉండగా, 53 శాతం మంది భారతీయ ఉద్యోగులు తమను నిలుపుకోవడానికి అధిక జీతాల కంటే ఎక్కువ పని సౌలభ్యాన్ని ఇష్టపడుతున్నారని అధ్యయనం పేర్కొంది. పురుషులకు ధీటుగా, కంపెనీలలో పని విషయంలో రాణించటం మాత్రమే కాదు, ప్రమోషన్ల విషయంలో పురుషులను వెనక్కు నెట్టి ముందుకు వెళ్తున్న మహిళా లోకానికి సలాం చెయ్యాల్సిందే.

English summary

మహిళలకు సలాం: ఆ విషయంలో యూఎస్, యూకేలతో పాటు భారతీయ పురుషులను దాటేశారుగా!! | Hats off to Indian women in promotions; US, UK as well as Indian men have been surpassed

The HP INC study found that Indian women, 92 per cent of women respondents in India confirmed receiving a promotion last year . They surpassed the US and UK and also Indian men in promotions.
Story first published: Wednesday, March 9, 2022, 17:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X