For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google Job: గూగుల్ లో జాబ్.. లక్షల ప్యాకేజీ కొట్టేసిన తెలుగమ్మాయి.. ఎలాగంటే..

|

Google Job: ఈ రోజుల్లో చాలా మంది కోరుకుంటున్నది సాఫ్ట్ వేర్ ఉద్యోగం. అదికూడా పేరున్న కంపెనీలో అయితే అత్యుత్తమం అని చాలా మంది భావిస్తుంటారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ కంపెనీలు అంటే అసలు యువతకు ఎంత క్రేజో మాటల్లో చెప్పుకోనక్కర్లేదు. ఇలాంటి తరుణంలో ఒక తెలుగమ్మాయి సంచలనాలు సృష్టిస్తోంది.

ఉద్యోగాల కోతల్లో..

ఉద్యోగాల కోతల్లో..

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల కారణంగా ఉద్యోగాల్లో కోతలు మెుదలయ్యాయి. ఇవి టెక్ దిగ్గజాలకు సైతం తప్పలేదు. కానీ ఇంత కష్టకాలంలోనూ ఒక తెలుగమ్మాయి అందులోనూ మన గుంటూరు అమ్మాయి లక్షల జీతంతో కూడిన ప్యాకేజీని కొట్టేసిందంటే మనందరం గర్వించాల్సిన విషయం.

సుందర్ పిచాయ్..

సుందర్ పిచాయ్..

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమిళనాడుకు చెందిన వ్యక్తి . ఆయన వార్షిక ఆదాయం సుమారు 242 మిలియన్ డాలర్లు. మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్లి ప్రపంచ ప్రఖ్యాత లీడర్ స్థాయికి చేరుకోవటం చాలా మంది విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యార్థులందరికీ ఆయన రోల్‌ మోడల్‌. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 22 ఏళ్ల రావూరి పూజితది కూడా ఇలాంటి కలే. ఆమె ప్రఖ్యాత గూగుల్ కంపెనీలో రూ.60 లక్షల వార్షిక ప్యాకేజీ జీతానికి ఉద్యోగాన్నిసంపాదించింది. దీంతో వారి తల్లిదండ్రులతో పాటు స్నేహితుల్లో కూడా సంతోషం వ్యక్తమవుతోంది.

పూజిత తండ్రి..

పూజిత తండ్రి..

రావూరి పూజిత తండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారు. తాను చదువుకునేటప్పటికి తనకి చెప్పే సందేహాలు నివృత్తి చేసేవారు ఎవరూ లేకపోవడంతో తనంతట తానుగా చదువుకుంటూ పెరిగాడు. తనకు వచ్చిన ప్రతి ప్రశ్నను శోధించి అధ్యయనం చేశాడు. ఇంజినీరింగ్ చదవడానికి జేఈఈ పరీక్ష కూడా రాశాడు. అలా ఆకాలంలో జార్ఖండ్‌లోని పిట్స్ సెంటర్‌లో చదువుకునే అవకాశం వచ్చింది. అంత దూరం వెళ్లవద్దని తల్లిదండ్రులు చెప్పిన మాటలకు గుంటూరులోనే విద్యను పూర్తి చేశాడు.

 కరోనా కారణంగా..

కరోనా కారణంగా..

పూజిత కాలేజీ మెుదటి సంవత్సరం చదువుతున్న సమయంలో కరోనా వచ్చింది. దీంతో ఆన్ లైన్ తరగుతల్లో విద్యను కొనసాగించాల్సి వచ్చింది. ఆ సమయంలో తలెత్తే సందేహాలను సీనియర్ విద్యార్థులను అడిగి తెలుసుకునేది. అప్పటికీ క్లారిటీ అవరసమైతే ఇంటర్నెట్‌లో సోధించి చదువుకునేది. కోడింగ్ క్లాసుల్లో అర్థం కాని విషయాలను యూట్యూబ్ వీడియోల సాయంతో తెలుసుకునేది. మాక్ పరీక్షలు కూడా రాసేది. అలా కోడింగ్ లో అత్యుత్తమంగా మారి గూగుల్, అడోబ్, అమెజాన్ వంటి కంపెనీల్లో ఆఫర్స్ సంపాదించింది. దీంతో ఆంధ్రా విద్యార్థికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

English summary

Google Job: గూగుల్ లో జాబ్.. లక్షల ప్యాకేజీ కొట్టేసిన తెలుగమ్మాయి.. ఎలాగంటే.. | Guntur Girl Ravuri Pujitha got job in google for 60 lakhs package know details

Guntur Girl Ravuri Pujitha got job in google for 60 lakhs package know details
Story first published: Wednesday, January 11, 2023, 18:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X