For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crores In Account: ఒకేసారి అకౌంట్లోకి రూ.11,677 కోట్లు.. గుజరాత్ వాసికి అదృష్టం.. మ్యాటర్ ఏంటంటే..

|

Jackpot: అదృష్టం అంటే ఇలా ఉండాలి. వందలో వేలో కాదు ఏకంగా వేల కోట్లు ఒక్కసారిగా అకౌంట్లో వచ్చిపడితే. ఇది అసలు జరుగుతుందా అంటే నిజంగా జరిగింది. అది కూడా విదేశాల్లో కాదు.. మన దేశంలోనే. పూర్తి వివరాలు చూస్తే..

అకౌంట్లోకి డబ్బు..

అకౌంట్లోకి డబ్బు..

అహ్మదాబాద్ కు చెందిన వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి ఎదురైంది. అతను గత ఐదారేళ్లుగా ట్రేడింగ్ చేస్తుంటాడు. అతను ఏడాది కిందట కోటక్ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్ ఖాతా తెరిచాడు. దాని ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడులను నిర్వహిస్తుంటాడు. అతని అకౌంట్లోకి ఒక్కసారిగా రూ.11,677 కోట్లు ప్రత్యక్షం కావటంతో నివ్వెరపోయాడు.

ఎనిమిది గంటల పాటు..

ఎనిమిది గంటల పాటు..

అకౌంట్ హోల్డర్ రమేష్ సాగర్ డీమ్యాట్ ఖాతాలో ఎనిమిది గంటలకు పైగా డబ్బు ఉంది. జూలై 26, 2022న తన ఖాతాలో భారీగా సొమ్ము ఉండటాన్ని అతడు గమనించాడు. అకౌంట్లో అతనికి సంబంధించి రూ. 2 కోట్లు ఉన్నాయి. ఆ రోజు ట్రేడింగ్ ద్వారా అతడు రూ.5 లక్షలు సంపాదించాడు. ఆ సమయంలో అకౌంట్ తనిఖీ చేస్తుండగా దీనిని గమనించినట్లు తెలిపాడు.

వెనక్కి తీసుకున్న బ్యాంక్..

వెనక్కి తీసుకున్న బ్యాంక్..

అనేక గంటల పాటు డబ్బు ఖాతాలోనే ఉన్నప్పటికీ చివరికి బ్రోకరేజ్ సంస్థ వాటిని వెనక్కి తీసుకుంది. యాప్‌లో మార్జిన్ అప్‌డేట్‌లో సమస్య ఉండటం వల్లే ఈ తప్పిదం జరిగింది. దీనికి సంబంధించి బ్యాంక్ నుంచి తనకు నోటిఫికేషన్ వచ్చిందని రమేష్ సాగర్ తెలిపారు.

టెక్నికల్ కారణాలతో..

టెక్నికల్ కారణాలతో..

బ్రోకరేజ్ సంస్థ యాప్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య వచ్చింది. ఆ సమయంలో కస్టమర్లకు మార్జిన్ వివరాలు అప్‌డేట్ కాలేదు. ఆ రోజు చాలా మంది కస్టమర్లకు ఇలాగే జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. తర్వాత బ్యాంక్ ఈ తప్పిదాన్ని సరిదిద్దింది. దీనిపై వార్తా సంస్థలు కోటక్ సెక్యూరిటీస్ ను సంప్రదించినప్పటికీ బ్యాంక్ వ్యక్తులకు సంబంధించిన ఇలాంటి వివరాలపై స్పందించటం కుదరదని వెల్లడించింది.

English summary

Crores In Account: ఒకేసారి అకౌంట్లోకి రూ.11,677 కోట్లు.. గుజరాత్ వాసికి అదృష్టం.. మ్యాటర్ ఏంటంటే.. | gujarat stock market investor gets 11,677 crores in his trading demat account of kotak securities

gujarat stock market investor gets 11,677 crores in his trading demat account of kotak securities
Story first published: Friday, September 16, 2022, 12:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X