For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Free LPG Cylinders: ఆ రాష్ట్రంలో ఏడాదికి 2 సిలిండర్లు ఫ్రీ.. ఆశ్చర్యపోతున్న ప్రజలు.. అందుకేనా..?

|

Free LPG Cylinders: దేశంలో నిత్యావసరాలతో పాటు గ్యాస్ సిలిండర్ల ధర విపరీతంగా పెరిగింది. పైగా సబ్సిడీనీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటంతో అనేక మంది మధ్య తరగతి ప్రజలు సైతం ధరల భారాన్ని మోయక తప్పటం లేదు. చాలా మంది తమ నెలవారీ సంపాదనలో ఎక్కువ శాతం పెట్రోల్, గ్యాస్, ఆహార పదార్ధాలకే వెచ్చిస్తున్నట్లు చెబుతున్నారు.

ఉచిత సిలిండర్స్..

ఉచిత సిలిండర్స్..

ఈ క్రమంలో ప్రతి కుటుంబానికి ఏడాదిలో 2 సిలిండర్లను ఉచితంగా అందించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రకటిస్తూ సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తమకు ఏడాదికి రూ.2,000 వరకు ఆదా అవుతుందని చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి మాట..

మంత్రి మాట..

ప్రభుత్వ నిర్ణయంపై గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వకానీ స్పందించారు. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వం 18 లక్షల కుటుంబాలకు భారం తగ్గించటానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల గుజరాత్ ప్రభుత్వంపై రూ.650 కోట్ల అదనపు భారం పడుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో లబ్ధిదారుల కుటుంబాలకు రూ.1,700 నగదు చేతికి అందజేయనున్నట్లు వెల్లడైంది.

వ్యాట్ తగ్గింపు..

వ్యాట్ తగ్గింపు..

ఈ ప్రకటనకు ముందు గుజరాత్ ప్రభుత్వం CNG, PNGపై 10 శాతం వ్యాట్ పన్నును తగ్గించింది. తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ల ప్రకటన చేసింది. అధికారంలో ఉన్న బీజేపీవి చిత్తశుద్ధి లేని చర్యలని అనేక మంది ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఈ రూపంలో తాయిలాలను ఇచ్చి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోందని అంటున్నారు.

అమిత్ షా..

అమిత్ షా..

అవసరం కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చే బీజేపీకి ఇది పెద్ద పరీక్షా కాలంగా కనిపిస్తోంది. ఎన్నికలకు షెడ్యూల్ రావటానికి ముందుగా.. ప్రధాని మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనే అధికారికంగా తాయిలాల ప్రకటన పెద్ద దుమారంగా మారింది. ప్రతి పక్షాలు ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని.. ఎలక్షన్స్ తర్వాత దీనిని నిలిపివేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా ఈ నిర్ణయం ప్రజలకు కొంత కాలం ఊరటను ఇవ్వనుంది.

English summary

Free LPG Cylinders: ఆ రాష్ట్రంలో ఏడాదికి 2 సిలిండర్లు ఫ్రీ.. ఆశ్చర్యపోతున్న ప్రజలు.. అందుకేనా..? | gujarat government announced 2 free lpg cylinders per year amid assembly elections

gujarat government announced 2 free lpg cylinders per year amid assembly elections
Story first published: Tuesday, October 18, 2022, 11:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X