For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IGST: దిగుమతులపై పన్ను ఎగ్గొట్టిన 24 పెద్ద సంస్థలు.. పట్టించేసిన ఆ టెక్నాలజీ..

|

Tax Evation: ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ భారీగా పన్ను ఎగవేతదారులను గుర్తించాయి. ఇందులో దాదాపు 24 పెద్ద దిగుమతిదారులు ఉన్నట్లు వారు వెల్లడించారు.

ఈ బడా దిగుమతిదారులు ప్రభుత్వానికి దాదాపు 1.5 బిలియన్ డాలర్లు అంటే రూ.11,000 కోట్ల ఇంటిగ్రేటెడ్ జీఎస్టీని ఎగ్గొట్టినట్లు అధికారులు కనుగొన్నారు. పన్ను ఎగవేసిన వాటిలో ఉక్కు, ఫార్మాస్యూటికల్, రత్నాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్ రంగాల్లోని కొన్ని కంపెనీలు ఇందులో ఉన్నట్లు వెల్లడైంది. పరోక్ష పన్నుల్లో అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ రూపొందించిన డేటా ఆధారంగా పన్ను మోసం బయటపడింది.

gst

మెుత్తం 24 పెద్ద దిగుమతిదారులు రూ.11 వేల కోట్లు మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించగా.. దీనికి సంబంధించిన 7 యూనిట్లకు నోటీసులు పంపారు. గత 20 రోజుల్లో ముంబై, కోల్‌కతా, చెన్నై అధికార పరిధిలోని దిగుమతిదారులకు ఈ నోటీసులు పంపబడ్డాయి. ఇతర ఇంపోర్టర్లకు సైతం నోటీసులు పంపే ప్రక్రియను ఏజెన్సీలు ప్రారంభించాయి.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను తప్పుగా పొందే సంస్థలను గుర్తించేందుకు అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ సాంకేతికతను అధికారులు వినియోగిస్తున్నందున ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే డేటా స్వతంత్రంగా ధృవీకరించబడిన, ఫీల్డ్ ఫార్మేషన్‌ల ద్వారా తనిఖీ చేయబడిన సందర్భాల్లో మాత్రమే నోటీసులు పంపబడ్డాయని అధికారి తెలిపారు. దిగుమతిదారులు & ఎగుమతిదారుల గురించి కొత్త సమాచారాన్ని సంగ్రహించడానికి పరోక్ష పన్నుల్లో అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ (ADVIT)ని మరింత బలోపేతం చేయడాన్ని ప్రభుత్వం ఇప్పుడు పరిశీలిస్తోంది.

నకిలీ ఇన్‌వాయిస్‌లు, నకిలీ జిఎస్‌టి రిజిస్ట్రేషన్, తప్పుడు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లను గుర్తించడానికి ప్రభుత్వం మే 16 నుంచి రెండు నెలల పాటు ఇంటెన్సివ్ ప్రచారాన్ని ప్రారంభించబోతోంది.

English summary

IGST: దిగుమతులపై పన్ను ఎగ్గొట్టిన 24 పెద్ద సంస్థలు.. పట్టించేసిన ఆ టెక్నాలజీ.. | GST officials found 24 importers evaded tax worth 11000 crores served notices used technology

GST officials found 24 importers evaded tax worth 11000 crores served notices used technology
Story first published: Friday, May 12, 2023, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X