For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన జీఎస్టీ వసూళ్లు, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లు

|

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) వసూళ్లు పెరిగాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి మొత్తం రూ.95,480 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైన కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే అత్యధిక వసూళ్లు. గత ఏడాది సెప్టెంబర్ మాసంతో పోలిస్తే ఈ సారి వసూళ్లు 4 శాతం పెరగడం గమనార్హం. ఈ డాది ఆగస్ట్‌తో పోలిస్తే పది శాతం పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వసూళ్లు పడిపోయిన విషయం తెలిసిందే.

మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.17,741 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.23,131 కోట్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూపంలో రూ.47,484 కోట్లు వసూలు అయ్యాయి. సెస్ రూపంలో రూ.7,124 కోట్లు వచ్చాయి. కార్యకలాపాలు పుంజుకోవడం జీఎస్టీ వసూళ్లు పెరగడానికి దోహదపడ్డాయి. సెటిల్మెంట్ తర్వాత సెంట్రల్, స్టేట్ జీఎస్టీ రూ.39,001 కోట్లు, రూ.40,128 కోట్లుగా ఉంది.

GST mop up rises 4 percent to Rs 95,480 crore in September

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.32,172 కోట్లకు క్షీణించాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.1,13,865 కోట్లు ఉంది. మే నెలలో రూ.62,151 కోట్లు, జూన్‌లో రూ.90,917 కోట్లు, జూలైలో 87,422 కోట్లు, ఆగస్ట్‌లో రూ.86,449 కోట్లు వసూలు కాగా, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లు వసూలయ్యాయి.

English summary

పెరిగిన జీఎస్టీ వసూళ్లు, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లు | GST mop up rises 4 percent to Rs 95,480 crore in September

The Goods and Services Tax (GST) collection, a tax on consumption, has shown the first sign of recovery in business activities since the outbreak of Covid-19 pandemic and subsequent lockdown from March 25 with a 4% year-on-year growth at Rs 95,480 crore in the September, and a 10.4% jump over the preceding month, official data said.
Story first published: Thursday, October 1, 2020, 21:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X