For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ: కరోనా ఉత్పత్తులు, ట్యాక్స్ రేట్ కట్‌పై చర్చ

|

కరోనా మెడిసిన్స్, వ్యాక్సిన్, వైద్య పరికరాలపై జీఎస్టీ తగ్గింపు, రాష్ట్రాలకు ఆదాయం తగ్గిన నేపథ్యంలో అధిక పరిహారం చెల్లింపు వంటి అంశాలపై చర్చించేందుకు జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం సమావేశమవుతోంది. సుమారు 8 నెలల తర్వాత ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, కేరళ, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రులు సంయుక్త వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తున్నారు.

కరోనా అత్యవసరాలపై జీరో ట్యాక్స్ కోరుతున్నారని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఇందులో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు.

GST Council to discuss tax rate cut on Covid essentials on Friday

కాగా, కరోనా కట్టడికి కావాల్సిన వైద్య ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. నేడు జరగనున్న సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అయితే, కరోనా వైద్య ఉత్పత్తులు అన్నింటికి లేదా అవసరాలకు పన్ను మినహాయింపు లభించకపోవచ్చని తెలుస్తోంది. ఆక్సిజన్‌తో పాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, జనరేటర్స్, పల్స్ ఆక్సిమీటర్స్, కరోనా టెస్టింగ్ కిట్స్‌కు మాత్రం పన్ను ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిపై జీఎస్టీని 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ సిఫార్స్ చేసింది.

English summary

నేడు జీఎస్టీ కౌన్సిల్ భేటీ: కరోనా ఉత్పత్తులు, ట్యాక్స్ రేట్ కట్‌పై చర్చ | GST Council to discuss tax rate cut on Covid essentials on Friday

The GST Council is likely to discuss on Friday a reduction in the tax rate on Covid medicines, vaccines and medical equipment as well as means to make up for the shortfall in revenues promised to states.
Story first published: Friday, May 28, 2021, 7:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X