For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST: మారిన జీఎస్టీలో రూల్స్.. వ్యాపారవేత్తలు సిద్ధం కావాలన్న జీఎస్టీ కౌన్సిల్..!!

|

GST: దేశంలో వ్యాపారాలను సజావుగా నిర్వహించుకోవాలంటే జీఎస్టీ రూల్స్ తప్పనిసరిగా పాటించటం అవసరం. అయితే జీఎస్టీ బిల్లింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులను తీసుకొచ్చింది. దీని వల్ల మరిన్ని కంపెనీలు GST పన్ను విధానంలోకి వస్తాయి.

2023 నుంచి..

2023 నుంచి..

పన్ను ఎగవేతలను అరికట్టేందుకు వీలుగా దీనిని రూపొందించారు. ఇందుకు సంస్థలు, పారిశ్రామికవేత్తలు సిద్ధం కావాల్సి ఉంటుంది. CBDT జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రూ.5 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలన్నీ తప్పనిసరిగా ఈ- ఇన్వాయిసింగ్ విధానాన్ని పాటించాల్సిందే. ఈ మారిన రూల్స్ జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

టర్నోవర్ లిమిట్స్..

టర్నోవర్ లిమిట్స్..

రూ.5 కోట్ల కంటే ఎక్కువగా ఉండే కంపెనీలకు కొత్త రూల్స్ వచ్చినందున.. అందుకు అనుగుణంగా ట్రాఫిక్‌ నియంత్రణకు అనుగుణంగా ప్లాట్‌ఫారమ్‌ను అప్‌గ్రేడ్ చేయాలని టెక్నికల్ కంపెనీకి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయలు టర్నోవర్ ఉన్న వ్యాపారాలను సైతం జీఎస్టీ ఈ-బిల్లింగ్ కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. GST కౌన్సిల్‌ వీటి విస్తరణ పనిలో వేగంగా ముందుకు సాగుతున్నాయి.

చిన్న, సూక్ష్మ సంస్థలకూ..

చిన్న, సూక్ష్మ సంస్థలకూ..

చివరికి దేశంలోని చిన్న, సూక్ష్మ పరిశ్రమలను సైతం GST బిల్లింగ్ విధానంలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్గీకరించని రంగంలో ఉన్న లక్షలాది కంపెనీలు ఈ పరిధిలోకి రానున్నాయి. దీనివల్ల టాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ అండ్ సెటిల్మెంట్ ప్రక్రియ చాలా సులువుగా మారటంతో పాటు వేగంవంతం అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

GST ఇన్‌వాయిస్ పద్ధతి..

GST ఇన్‌వాయిస్ పద్ధతి..

రూ.500 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన కంపెనీల విషయంలో అక్టోబర్ 1,2020 నుంచి దేశంలో ఇంటర్-కంపెనీ వాణిజ్యం కోసం GST ఇన్‌వాయిస్ విధానం ప్రవేశపెట్టబడింది. దీని తర్వాత జనవరి 1, 2021 నుంచి రూ.100 కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీకు సైతం ఈ-ఇన్‌వాయిసింగ్ తప్పనిసరిగా మారింది.

మధ్య తరహా వ్యాపారాల విషయంలో..

మధ్య తరహా వ్యాపారాల విషయంలో..

జీఎస్టీ అమలు విధానంలో మరింత ముందుకు సాగుతూ.. ఏప్రిల్ 1,2021న రూ.50 కోట్లు, ఏప్రిల్ 2022 నుంచి రూ.20 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు జీఎస్టీ బిల్లింగ్ లూప్ కిందకు తీసుకొచ్చింది. జనవరి 1,2023 నుంచి రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు సైతం ఈ విధానాన్ని తప్పనిసరి చేసింది.అయితే వస్తున్న మార్పులను తమ వ్యాపారాల్లో అమలు చేసేందుకు వ్యాపారవేత్తలు సంసిద్ధంగా ఉండాలని జీఎస్టీ కౌన్సిల్ తెలిపింది.

Read more about: gst billing gst rules business news
English summary

GST: మారిన జీఎస్టీలో రూల్స్.. వ్యాపారవేత్తలు సిద్ధం కావాలన్న జీఎస్టీ కౌన్సిల్..!! | GST council mandated E-invoices for businesses with 5 crores annual turnover from 2023

GST council mandated E-invoices for businesses with 5 crores annual turnover from 2023..
Story first published: Tuesday, October 11, 2022, 15:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X