GST collections: 7% పెరిగి రూ.1.13 లక్షల కోట్లు
జీఎస్టీ వసూళ్లు ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సోమవారం విడుదల చేసిన ఫైనాన్స్ మినిస్ట్రీ డేటా ప్రకారం జీఎస్టీ వసూళ్లు రూ.1.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లకు పైగా పెరగడం వరుసగా ఇది ఐదోసారి. గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ ఫిబ్రవరికి 7 శాతం పెరిగాయి. ఆర్థిక రికవరీకి ఇది నిదర్శమనమని చెబుతున్నారు.
అక్టోబర్ నెల నుండి జీఎస్టీ వసూళ్లు రూ.1 లక్ష కోట్లు దాటుతున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో రూ.1.05 లక్షల కోట్లు, డిసెంబర్ నెలలో రూ.1.15 లక్షల కోట్లు, జనవరిలో రూ.1.20 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ.1.13 లక్షల కోట్లు వసూలయ్యాయి.

గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఉత్పత్తుల దిగుమతుల వల్ల వచ్చే ఆదాయం ఏకంగా 15 శాతం పెరిగింది. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ఆదాయం 5 శాతం పెరిగాయి. 2017లో జీఎస్టీ అమలయినప్పటి నుండి తొలిసారి ఈ ఏడాది జనవరి నెలలో రూ.1.20 లక్షల కోట్లు వసూలయ్యాయి.