For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

GST collections: జూన్ నెలలో 56 శాతం పెరిగిన జీఎస్టీ కలెక్షన్స్

|

జూన్ 2022లో జీఎస్టీ కలెక్షన్స్ అదరగొట్టాయి. ఏడాది ప్రాతిపదికన ఏకంగా 56 శాతం పెరగగా, నెల ప్రాతిపదికన మే నెలను మించి వసూలు అయ్యాయి. 2022 జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1.44 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మే నెలలో ఈ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 మార్చి నుండి జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లకు పైగానే నమోదవుతున్నాయి. అంటే వరుసగా నాలుగో నెల ఈ మార్కు దాటింది. 2021 ఏప్రిల్ నెల నుండి రెండు నెలలు మినహాయించి ప్రతి నెల రూ.1 లక్ష కోట్లు దాటాయి. 2022 ఏప్రిల్ నెలలో అయితే జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.1.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత ఇదే అత్యధికం.

పన్ను ఎగవేతదారులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడంతో వసూళ్లు పెరిగాయని ఆర్థిక శాఖ తెలిపింది. 2021 జూన్ నెలలో రూ.92,800 కోట్లు వసూలు కాగా, ఇప్పుడు రూ.1.44 లక్షల కోట్లు వసూలయ్యాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... ప్రస్తుతం జీఎస్టీ వసూళ్లు ప్రతి నెల కనీసం రూ.1.40 లక్షలు ఉండవచ్చునని తెలిపింది.

 GST collections in June jump 56 percent to Rs 1.44 lakh crore

గత నెలలో వసూలైన రూ.1.44 లక్షల కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.25,306 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.32,406 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.75,887 కోట్లు నమోదు కాగా, సెస్ వాటా రూ.11,018 కోట్లుగా ఉంది. ఐజీఎస్టీలో వచ్చిన మొత్తంలో రూ.29,588 కోట్లు సీజీఎస్టీ కింద, రూ.24,235 కోట్లు ఎస్జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. ఫలితంగా కేంద్రానికి రూ.68,394 కోట్లు, రాష్ట్రాలకు రూ.70,141 కోట్లు దక్కాయి.

English summary

GST collections: జూన్ నెలలో 56 శాతం పెరిగిన జీఎస్టీ కలెక్షన్స్ | GST collections in June jump 56 percent to Rs 1.44 lakh crore

GST collections in June jumped 56% year on year to touch Rs 1,44,616 crore, driven by economic recovery and anti evasion drives such as action against fake billers.
Story first published: Friday, July 1, 2022, 17:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X