For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిటర్న్ ఫైలింగ్ తేదీ పొడిగింపు, 70 శాతం పడిపోయిన ఆదాయం

|

ఏప్రిల్ నెలలో జీఎస్టీ కలెక్షన్లు 70 శాతం పడిపోయాయి. కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2020లో జీఎస్టీ వసూళ్లు రూ.16,707 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో రూ.55,329 కోట్లు వసూలు అయ్యాయి. అంటే డెబ్బై శాతం వసూళ్లు తగ్గాయి. సాధారణంగా జీఎస్టీ వసూళ్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వసూళ్లు ఉంటాయి. CGA డేటా కేవలం కేంద్రం వాటా వసూళ్లు మాత్రమే చూపిస్తుంది.

<strong>గుడ్‌న్యూస్: ఆధార్ కార్డు ఉంటే 15 నిమిషాల్లో ఈ-పాన్ నెంబర్, ఇలా చేయండి..</strong>గుడ్‌న్యూస్: ఆధార్ కార్డు ఉంటే 15 నిమిషాల్లో ఈ-పాన్ నెంబర్, ఇలా చేయండి..

జీఎస్టీ మొత్తం వసూళ్లు

జీఎస్టీ మొత్తం వసూళ్లు

ఏప్రిల్ 2019లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ వసూళ్లు రూ.1,13,865 కోట్లుగా ఉంది. ఈ ఏప్రిల్ నెలలో కేంద్రం జీఎస్టీ వాటా రూ.16,707 కోట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ వసూళ్లు రూ.34,300 కోట్ల వరకు ఉండే అవకాశముంది. కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా జీఎస్టీ వసూళ్లు భారీగా పడిపోయాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఏప్రిల్ జీఎస్టీ కలెక్షన్స్... మార్చి ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించింది. మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రారంభమైంది.

కలెక్షన్లపై ప్రభావం

కలెక్షన్లపై ప్రభావం

రిటర్న్ ఫైలింగ్ తేదీలను పొడిగించినందు వల్ల ఏఫ్రిల్ నెలలో జీఎస్టీ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడి ఉంటుంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో కేంద్రం ఉద్యోగులు, వ్యాపారులు, సంస్థలు, రైతులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల కోసం అనేక చర్యలు చేపట్టింది.

జీఎస్టీఆర్ 3బీ ఫైలింగ్

జీఎస్టీఆర్ 3బీ ఫైలింగ్

కేంద్రం ప్రకటన మేరకు రూ.5 కోట్లకు తక్కువ టర్నోవర్ కలిగిన రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ మార్చి, ఏప్రిల్, మే నెలలకు గాను GSTR-3B ఫైలింగ్ చివరి గడువు జూన్ చివరి వారం వరకు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ట్యాక్స్ పేయర్స్ నుండి వడ్డీని, ఆలస్యం ఫీజును, పెనాల్టీని వసూలు చేయరు. రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ మార్చి, ఏప్రిల్, మే నెలలకు కానీ దాఖలు చేయాల్సిన ఫైల్ రిటర్న్స్ గడువు జూన్ 2020 వరకు ఉంది. జూన్ 30వ తేదీ వరకు ఆలస్య రుముసు లేకుండా ఫైల్ చేయవచ్చు.

English summary

రిటర్న్ ఫైలింగ్ తేదీ పొడిగింపు, 70 శాతం పడిపోయిన ఆదాయం | GST collections down 70 percent in April

Centre may have held over the monthly GST collection figures for April, but data released by the Comptroller General of Accounts (CGA) suggests that GST collections have seen a precipitous drop of up to 70 per cent in April.
Story first published: Saturday, May 30, 2020, 11:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X