For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారికి రూ.40,000 కోట్ల రీఫండ్‌ను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకంటే?

|

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) దాదాపు 2,500 మంది ఎగుమతిదారులకు రూ.40,000 కోట్ల విలువైన ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (IGST)రీఫండ్‌ను బ్లాక్ చేసింది. ఎగుమతిదారులు నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)ను క్లెయిమ్ చేసుకుంటుండవచ్చునని డిపార్టుమెంట్ డేటా అథంటికేషన్ డ్రైవ్ సూచించింది. దీంతో దీనిని బ్లాక్ చేసింది.

ఆ ఎగుమతిదారులకు సంబంధించిన క్లెయిమ్స్‌ను వెరిఫై చేయాలని కూడా ఫీల్డ్ ఆఫీసర్లను CBIC ఆదేశించింది. నిజాయితీపరులైన ఎగుమతిదారులు ఇబ్బందిపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. నిర్ణీత సమయంలోపు వెరిఫై చేయాలని సూచించింది.

Big News: రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు సెబి షాక్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై నోటీసులుBig News: రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు సెబి షాక్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై నోటీసులు

Govt blocks Rs 40,000 crore GST claims to exporters

బ్లాక్ చేసిన అందరు ఎగుమతిదారులకు కూడా వెరిఫికేషన్ అంశంపై సమాచారం ఇవ్వాలని, నిర్ణీత సమయంలోపు దీనిని పూర్తి చేయాలని CBIC జీఎస్టీ పాలసీ విభాగం జనవరి 23వ తేదీన విడుదల చేసిన సర్క్యులర్‌లో.. కమిషనర్స్‌కు సూచించింది. గూడ్స్ ఎక్స్‌పోర్ట్స్ పైన నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా రీఫండ్ పొందిన సందర్భాలు ఇటీవల వెలుగు చూశాయని పేర్కొంది.

ఇలాంటి చర్యలను తగ్గించేందుకు CBIC మరిన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపింది. వెరిఫికేషన్ కోసం ఎంచుకున్న ఎగుమతుదారుల సంఖ్య చాలా తక్కువేనని పేర్కొంది. రూ.40,000 కోట్లకు సంబంధించిన ఇన్వాయిస్‌లు మ్యాచ్ కాకపోవడంతో నిలిపివేసింది. వెరిఫికేషన్ అనంతరం చర్యలు తీసుకుంటుంది.

English summary

వారికి రూ.40,000 కోట్ల రీఫండ్‌ను బ్లాక్ చేసిన కేంద్రం.. ఎందుకంటే? | Govt blocks Rs 40,000 crore GST claims to exporters

In one sweep, Central Board of Indirect Taxes and Customs (CBIC) has blocked the Integrated Goods & Service Tax (IGST) refund worth Rs 40,000 crore to around 2,500 exporters. The move comes after the department's data authentication drive suggested these exporters could be claiming input tax credit (ITC) using fake invoices and IGST credit on exports was paid using such ITCs.
Story first published: Tuesday, January 28, 2020, 15:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X