For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిడిల్ ఈస్ట్ నుంచి తగ్గిన చమురు దిగుమతి, అమెరికా-రష్యా దోస్తీకి మోడీ ప్లాన్!

|

మిడిల్ ఈస్టర్న్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్ 2019లో నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు వినియోగించే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. దిగుమతులు 84 శాతం. ఎక్కువగా మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతులు ఉంటాయి. కానీ గత ఏడాది ఇక్కడి నుంచి క్రూడాయిల్ దిగుమతి 60 శాతానికి తగ్గింది. మిడిల్ ఈస్ట్ నుంచి అంతకుముందు ఏడాది 65 శాతం దిగుమతులు ఉండగా, గత ఏడాది 60 శాతంగా ఉంది. 2015 తర్వాత ఈ స్థాయికి తగ్గడం ఇదే మొదటిసారి.

కస్టమర్లకు ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్: ప్రీపెయిడ్ యూజర్ల కోసంకస్టమర్లకు ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్: ప్రీపెయిడ్ యూజర్ల కోసం

మిడిల్ ఈస్ట్ నుంచి తగ్గిన దిగుమతులు

మిడిల్ ఈస్ట్ నుంచి తగ్గిన దిగుమతులు

అమెరికా, రష్యా వంటి దేశాల నుంచి దిగుమతి అవకాశాలు పెరుగుతున్నాయి. 2019లో ఇండియాకు రోజుకు 2.68 మిలియన్ బ్యారల్స్ (bpd) చమురు దిగుమతి అయింది. 2018 కంటే ఇది 10 శాతం తగ్గుదల. ఇతర దేశాల నుంచి 1.8 మిలియన్ బ్యారల్స్ దిగుమతి అయింది. ఒపెక్ దేశాల నుంచి తక్కువ ఆయిల్ ఔట్ పుట్ కట్ మరోవైపు, ఇరాన్ నుంచి దిగుమతులపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో 2019లో మిడిల్ ఈస్ట్ నుంచి భారత్ తక్కువ చమురును దిగుమతి చేసుకుందని ఈ రంగంలోని నిపుణులు ఎషాన్ ఉల్ హక్ అన్నారు.

నాన్ ఓపెక్ దేశాల సరఫరా పెరుగుతోంది

నాన్ ఓపెక్ దేశాల సరఫరా పెరుగుతోంది

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) తాజా నివేదిక ప్రకారం ఒపెక్, అనుబంధ దేశాలు 2018 నుంచి 1.9 మిలియన్ బ్యారల్స్ (bpd) సరఫరాను తగ్గించాయి. అదే సమయంలో నాన్-ఒపెక్ దేశాల సరఫరా 2 మిలియన్ బ్యారల్స్ (bpd) పెరిగింది. నాన్-ఒపెక్ దేశాలు 2020లో 2.1 మిలియన్ బ్యారల్స్ (bpd)సరఫరాను పెంచుతాయని IEA అంచనా వేసింది.

మిడిల్ ఈస్ట్‌పై ఆధారపడటం తగ్గించి...

మిడిల్ ఈస్ట్‌పై ఆధారపడటం తగ్గించి...

చమురు కోసం మిడిల్ ఈస్ట్‌పై ఎక్కువగా ఆధారపడటాన్ని భారత్ తగ్గిస్తోందని, ఇందుకు సరఫరా వనరులను విస్తృతం చేసే వ్యూహం దిశగా పని చేస్తోందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత వారం చెప్పారు. రష్యా చమురు దిగుమతులు పెంచేందుకు చర్చలు నడుస్తున్నట్లు చెప్పారు.

అమెరికా, రష్యాతో సంబంధాలు పెంచుకునేందుకు...

అమెరికా, రష్యాతో సంబంధాలు పెంచుకునేందుకు...

ముడి వనరులపై మోడీ ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు.. అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలతో సంబంధాలు పెంచుకోవడానికి కూడా అని భావిస్తున్నారు. ఆ దేశాలతో బంధాలు పెంచుకోవడానికి మోడీ చేసిన ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తోందని అంటున్నారు.

ముందే నవీనీకరించేందుకు

ముందే నవీనీకరించేందుకు

2019లో భారత్ మొత్తం చమురు దిగుమతులు 2.1 శాతం తగ్గి 4.48 మిలియన్ బ్యారెల్స్‌కు పడిపోయాయి. ఇందుకు కారణం ఉంది. 2020లో కొత్త ఇంధన ప్రమాణాల కంటే ముందుగానే వీటిని నవీనీకరించేందుకు చాలామంది తమ రిఫైనరీ ప్రాసెసింగ్ యూనిట్లను తాత్కాలికంగా మూసివేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారత్‌లో యూరో VI కాంప్లియెంట్ ఫ్యూయల్‌కు మారుతోంది.

సీఐఎస్ దేశాల నుంచి పెరిగిన చమురు దిగుమతులు

సీఐఎస్ దేశాల నుంచి పెరిగిన చమురు దిగుమతులు

2019లో CIS దేశాల నుంచి దిగుమతులు 65 శాతం మేర పెరిగి 171,000 bpdకి చేరుకున్నాయి. ఆఫ్రికన్ గ్రేడ్స్ 7.3 శాతం పెరిగి 713,000 bpd, అమెరికా సరఫరా 63 శాతం పెరిగి 181,000 bpdకి చేరుకుంది. 2019లో భారత్ దిగుమతుల్లో ఈ వాటా 4 శాతంగా ఉంది.

English summary

మిడిల్ ఈస్ట్ నుంచి తగ్గిన చమురు దిగుమతి, అమెరికా-రష్యా దోస్తీకి మోడీ ప్లాన్! | Government planning to diversify crude oil sources

India's imports of Middle Eastern oil plunged to a four year low in 2019, tanker data obtained from sources shows, as the energy hungry nation diversifies its supplies to cut costs and help shield itself from geopolitical tensions.
Story first published: Tuesday, January 21, 2020, 11:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X