For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

69,000 పెట్రోల్ పంపుల్లో EV ఛార్జింగ్ కియోస్క్‌లు

|

దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్(EV) వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 69,000 పెట్రోల్ పంప్స్‌ల్లో ఎలక్ట్రానిక్ వెహికిల్ చార్జింగ్ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఆయిల్ మార్కెటింగ్‌లో ఉన్న కంపెనీల యాజమాన్యంలోని పంపులు, వాటి నిర్వహణలోని పంపులు అన్నింటిలో ఎలక్ట్రానిక్ చార్జింగ్ కియోస్క్‌లు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలుస్తోంది.

వీటితో పాటు ఫ్రాంచైజీలో నడుపుతున్న పెట్రోల్ పంపుల్లోనూ వీటిని ఏర్పాటు చేసే విషయమై పరిశీలించాలని వాటి యాజమాన్యాలకు సూచించాలనేది పెట్రోలియం శాఖ అభిప్రాయం. ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై జరిగిన సమీక్ష సమావేశంలో చమురుశాఖ వర్గాలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఈ మేరకు సూచనలు చేశారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ నిర్వహణలోని అన్ని సీవోసీవో పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ కియోస్క్‌లను పెట్టే విధంగా చమురు శాఖ ఆదేశాలు జారీ చేయవచ్చునని సూచించింది.

అదేం బ్యాడ్ ఐడియా కాదు: దిగుమతి సుంకం పెంపు, లగ్జరీ కార్లు మరింత భారం!అదేం బ్యాడ్ ఐడియా కాదు: దిగుమతి సుంకం పెంపు, లగ్జరీ కార్లు మరింత భారం!

Government mulls installing electric vehicle charging kiosks at 69,000 petrol pumps

నగరాలతో పాటు నేషనల్ హైవేలపై కూడా ఈవీ ఛార్జింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, వడోదర, భోపాల్ వంటి నగరాలపై చమురు శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపాయి.

English summary

69,000 పెట్రోల్ పంపుల్లో EV ఛార్జింగ్ కియోస్క్‌లు | Government mulls installing electric vehicle charging kiosks at 69,000 petrol pumps

The government is mulling setting up at least one electric vehicle (EV) charging kiosk each at nearly 69,000 petrol pumps across the country to induce people to go for electric mobility.
Story first published: Monday, September 7, 2020, 15:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X