For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్: ఆ డెడ్‌లైన్లను రెండు నెలలు పొడిగించిన కేంద్రం

|

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహా భయానకంగా విజృంభిస్తోంది. సెకెండ్ వేవ్ దెబ్బ తీవ్రంగా పడుతోంది. అన్ని రంగాలూ దీని ప్రభావానికి గురవుతున్నాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యను విధించడం, వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. నిర్మాణ, మౌలిక రంగాలపై ఆధారపడిన పరిశ్రమలు సెకెండ్ వేవ్ ధాటికి కుప్పకూలిపోయే దశకు చేరుకుంటున్నాయి.

ఈ తీవ్ర పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం కొన్ని ఊరడింపు చర్యలను చేపడుతోంది. ప్రత్యేకించి- పన్నుచెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్‌ను ప్రకటించింది. డైరెక్ట్ ట్యాక్స్ వివాదాల నుంచి విశ్వాసం చట్టం కింద దాఖలు చేయాల్సి ఉన్న పలు ప్రతిపాదనలకు సంబంధించిన డెడ్ లైన్‌ను రెండు నెలల పాటు పొడిగించింది. వివాదాల నుంచి విశ్వాసం చట్టం కింద ఈ నెల 30వ తేదీకి ముగియాల్సి ఉన్న ప్రతిపాదనలకు సంబంధించిన గడువు తేదీలన్నింటినీ జూన్ 30వ తేదీ వరకు పొడిగింది.

ఈ మేరకు ఈ మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ 1961 కింద అసెస్‌మెంట్ లేదా రీ అసెస్‌మెంట్ టైమ్ లిమిట్‌ను జూన్ 30వ తేదీ వరకు పొడిగింది. వాస్తవానికి దీని చివరి గడువు ఈ నెల 30. ఇదే చట్టం కింద డీఆర్పీపై జారీ చేయాల్సి ఉన్న కొన్ని మార్గదర్శకాలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పొడిగింపు వల్ల కోట్లాదిమంది పన్ను చెల్లింపుదారులకు లబ్ది కలుగుతుంది.

Government extends tax compliance deadlines up to June 30, Details here

గడువు తీరిన తరువాత దాఖలు చేసే ఆయా ప్రతిపాదనలపై ఇక ఎలాంటి అదనపు ఛార్జీల భారాన్ని కూడా పన్ను చెల్లింపుదారులు భరించాల్సిన అవసరం ఉండదు. గడువును మరో రెండునెలల పాటు పొడిగించడం వల్ల తమ పాత రిటర్నులను దాఖలు చేయడానికి కూడా అవకాశం లభిస్తుంది. దీనిపై అదనంగా ఎలాంటి ఛార్జీలను అధికారులు వసూలు చేయరు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత పన్నుల బకాయిలు ఏవైనా ఉంటే.. ఈ రెండు నెలల మధ్యకాలంలో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కట్టే వెసలుబాటు లభిస్తుంది.

English summary

ట్యాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్: ఆ డెడ్‌లైన్లను రెండు నెలలు పొడిగించిన కేంద్రం | Government extends tax compliance deadlines up to June 30, Details here

The government has extended certain timelines in light of the raging pandemic. It has decided that time for payment of amount payable under the Direct Tax Vivad se Vishwas Act, 2020, without an additional amount, shall be further extended to 30th June, 2021.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X