For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రభుత్వాలపై తలకుమించి 'రుణ'భారం, 1980 తర్వాత తొలిసారి

|

కరోనా వైరస్ భారత్‌తో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు రుణాలు తీసుకువచ్చి గట్టెక్కించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో భారత రుణ రేటు 91 శాతానికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు. 1980 తర్వాత జీడీపీలో రుణరేటు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి అవుతుందని ఓ నివేదిక వెల్లడించింది. జీడీపీలో రుణ నిష్పత్తి ప్రభుత్వం చేసే ఖర్చులను పరిమితం చేస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వ్యయంపై ప్రభావం చూపుతుంది.

రూ.2,000 నోట్ల 'వ్యాల్యూ' క్రమంగా తగ్గింది, నకిలీ నోట్లు ఎన్ని అంటే!రూ.2,000 నోట్ల 'వ్యాల్యూ' క్రమంగా తగ్గింది, నకిలీ నోట్లు ఎన్ని అంటే!

91 శాతానికి జీడీపీలో రుణ రేటు

91 శాతానికి జీడీపీలో రుణ రేటు

మోతీలాల్ ఓస్వాల్ సర్వే ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ(కేంద్రం, రాష్ట్రాలు) రుణాలు జీడీపీతో 75శాతానికి చేరుకున్నాయి. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో 91 శాతానికి, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 91.3 శాతానికి చేరుకోవచ్చునని నివేదిక తెలిపింది. ఈ రుణ నిష్పత్తి దేశం తన రుణాన్ని తీర్చడానికి ఎంత అవకాశం ఉందో చూపిస్తుంది. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉందని భావించవచ్చు. పెట్టుబడిదారులు ఈ నిష్పత్తితో ఓ అంచనాకు వస్తారు.

టార్గెట్ 60 శాతం.. FY25కు మిస్

టార్గెట్ 60 శాతం.. FY25కు మిస్

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం జీడీపీలో రుణ రేటు 77 శాతానికి మించితే దేశ ఆర్థిక వృద్ధి మందగించే ఆస్కారం ఉందని తెలిపింది. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం జీడీపీలో రుణ రేటును 60 శాతం లేదా అంతకంటే తగ్గించేందుకు దశాబ్దకాలం పట్టవచ్చు లేదా అంతకంటే ఎక్కువ కాలం పట్టవచ్చు. మందగమనం, కరోనా కంటే ముందు ప్రభుత్వం 2025 నాటికే ఈ టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పుడు 2030 సంవత్సరం లేదా దాటే అవకాశం కనిపిస్తోంది.

రియల్ జీడీపీ..

రియల్ జీడీపీ..

ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ జీడీపీ వృద్ధి రేటు 2010 దశాబ్ద కాలంలో 7 శాతంగా ఉంటే, 2020 దశాబ్దకాలంలో 5 శాతం నుండి 6 శాతంగా ఉండవచ్చునని తెలిపింది. పర్సనల్ కన్సంప్షన్, ప్రభుత్వ ఖర్చులు.. రియల్ జీడీపీ వృద్ధికి గత కొన్నేళ్లుగా కీలకంగా ఉన్నాయి.2014 నుండి 2020 వరకు రియల్ జీడీపీ సగటున 6.8 శాతంగా ఉండగా, రియల్ ఫిస్కల్ స్పెండింగ్స్ 9 శాతానికి పెరిగాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ 4.2 శాతానికి క్షీణిస్తుందని అంచనా వేసింది.

English summary

ప్రభుత్వాలపై తలకుమించి 'రుణ'భారం, 1980 తర్వాత తొలిసారి | Government debt seen topping 90 percent of GDP in FY21

Indian government's debt levels will reach 91 per cent of gross domestic product (GDP) in the current fiscal for the first time since 1980, before moderating slowly to 80 per cent by the end of the decade, says a report.
Story first published: Wednesday, August 26, 2020, 19:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X