For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

New PF Rules: గుడ్ న్యూస్.. మారిన PF విత్‌డ్రా రూల్స్.. ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..

|

New PF Withdraw Rules: ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో చాలా మందికి పీఎఫ్ ఖాతాలు తప్పనిసరిగా మారాయి. అత్యవసర సమయంలో ఇందులోని సొమ్మును వినియోగించుకోవాలని చూస్తుంటాం. మీకు కూడా పీఎఫ్ ఖాతా ఉన్నట్లయితే దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఉంది. ఈ నెల మెుదటి తారీఖున కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో చేసిన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 ఆర్థిక మంత్రి..

ఆర్థిక మంత్రి..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎఫ్ సొమ్ము విత్‌డ్రాపై విధించే పన్ను విషయంలో కీలక మార్పు చేశారు. దీనికి ప్రకారం ఏప్రిల్ 1, 2023 నుంచి PF ఉపసంహరణ నిబంధనలను మారుతున్నాయి. ఇది నిజంగా ఖాతాదారులకు పెద్ద ఊరటను అందించే ప్రకటన. పాన్ కార్డ్ లింక్ చేయని ఖాతాదారులు డబ్బు ఉపసంహరించుకుంటే ఆ సమయంలో 30 శాతం టీడీఎస్ గతంలో కట్ చేసే వారు. కానీ ఇప్పుడు దీనిని 20 శాతానికి తగ్గిస్తున్నట్లు తాజా బడ్జెట్ వెల్లడించింది.

 TDS ఎప్పుడు కట్ కాదు..

TDS ఎప్పుడు కట్ కాదు..

ఖాతాదారుడు తన పీఎఫ్ సొమ్మును 5 ఏళ్ల లోపు విత్ డ్రా చేస్తున్నట్లయితే టీడీఎస్ వసూలు రూల్స్ అమలవుతాయి. అలాంటి సందర్భంలో వారు నియమాల ప్రకారం సూచించబడిన టీడీఎస్ మెుత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఖాతా తెరచిన 5 ఏళ్ల తర్వాత సొమ్ము విత్‌డ్రా చేస్తే అప్పుడు వారు ఎలాంటి టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

పాన్ కార్డ్ లింక్ చేస్తే..

పాన్ కార్డ్ లింక్ చేస్తే..

మారిన రూల్స్ ప్రకారం పాన్ కార్డు ఉన్నవారు తక్కువ TDS చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుల పాన్ కార్డ్ EPFO రికార్డుల్లో అప్‌డేట్ కాకపోతే.. ఇప్పుడు 20 శాతం టీడీఎస్ చెల్లిస్తే సరిపోతుంది. అలాగే రూ.50,000 కంటే ఎక్కువ సొమ్ము విత్‌డ్రా చేసి.. పాన్ కార్డ్ లింక్ అయినట్లయితే వారు కేవలం 10% TDS చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగా ఖాతాదారులు తమ ఫీఎఫ్ ఖాతాకు పాన్ నంబర్ లింక్ చేయటం చాలా కీలకం మరియూ ప్రయోజనకరం కూడా.

TDS పరిమితి..

TDS పరిమితి..

రానున్న కాలంలో టీడీఎస్ రూల్స్ మరింతగా కఠినతరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన కేంద్ర వార్షిక బడ్జెట్ పత్రాల ప్రకారం టీడీఎస్ పై రూ.10,000 కనీస థ్రెషోల్డ్ పరిమితిని కేంద్రం తొలగించింది. ఇది జూలై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. అయితే లాటరీలు, క్రాస్ వర్డ్ పజిల్స్, గేమ్స్ మెుదలైనవాటిపై రూ.10,000 లిమిట్ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే కో-ఆపరేటివ్ ల నగదు విత్ డ్రా విషయంలో ఈ పరిమితిని పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

English summary

New PF Rules: గుడ్ న్యూస్.. మారిన PF విత్‌డ్రా రూల్స్.. ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే.. | Government changed PF withdraw TDS Rules in budget 2023 know details

Government changed PF withdraw TDS Rules in budget 2023 know details
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X