విమాన ప్రయాణీకులకు శుభవార్త. ఎగురుతున్న విమానాల్లో కూడా వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎయిర్ లైన్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇంటర్నెట్ సేవలను ప్రయాణీకులకు అందించేలా విమానయాన సంస్థలకు అనుమతి ఇస్తూ పౌర విమానయాన శాఖ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది.
విమాన ప్రయాణం సమయంలో ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేలా ప్రయాణీకులకు పైలట్ ఇన్ కమాండ్ అనుమతిని ఇవ్వవచ్చునని, తద్వారా వైఫై సదుపాయంతో ల్యాప్‌టాప్, ట్యాబ్, స్మార్ట్ వాచ్, ఈ-రీడర్ వంటి డివైజ్‌లను ఫ్లైట్ మోడ్ లేదా ఎరోప్లేన్ మోడ్‌లో ఉంచి ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చునని పేర్కొంది.

అయితే విమానంలో నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవలను అందించే సదుపాయాలు ఉన్నాయని డైరెక్టర్ జనరల్ ధ్రవీకరించవలసి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం అనుమతి నేపథ్యంలో శుక్రవారం విస్తారా ఎయిర్ లైన్స్ తొలి బోయింగ్ 787-9 విమానాన్ని వాషింగ్టన్లో అందుకుంది. భారత్‌లో ఇన్-ఫ్లైట్ వైఫై సేవలను అందించనున్న తొలి విమానం ఇదే కానుందని విస్తారా సీఈవో పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications