For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1 లక్షకోట్ల డాలర్ల అమెరికా కంపెనీగా... సుందర్ పిచాయ్ నేతృత్వంలోని అల్భాబెట్ అరుదైన రికార్డ్:

|

సెర్చింజన్ గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ అరుదైన ఘనత సాధించింది. గురువారం కంపెనీ మార్కెట్ వ్యాల్యూ మొదటిసారి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా ఈ మైలురాయిని అందుకున్న నాలుగో అమెరికా టెక్ కంపెనీగా నిలిచింది. గురువారం ట్రేడింగ్‌లో అల్భాబెట్ షేర్ 0.7 శాతం పెరిగింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంది.

HDFC గుడ్‌న్యూస్: ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ ఇంటికి సేవలుHDFC గుడ్‌న్యూస్: ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే మీ ఇంటికి సేవలు

1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూకు తొలిసారి యాపిల్

1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూకు తొలిసారి యాపిల్

ఇంతకుముందు 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూకు చేరుకున్న వాటిలో యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో గూగుల్ మాతృసంస్థ అల్భాబెట్ నిలిచింది. రెండేళ్ల క్రితం అంటే 2018లో మొదటిసారి 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ స్థాయికి చేరుకున్న తొలి సంస్థ యాపిల్.

యాపిల్ తర్వాత మైక్రోసాఫ్ట్ సెకండ్

యాపిల్ తర్వాత మైక్రోసాఫ్ట్ సెకండ్

అమెరికాలో మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీల్లో యాపిల్ నిలిచింది. దీని మార్కెట్ వ్యాల్యూ దాదాపు 1.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ మార్కెట్ వ్యాల్యూ 1.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2018 సెప్టెంబర్ నెలలో ట్రిలియన్ డాలర్ల కంపెనీగా నిలిచింది. ఆ తర్వాత కంపెనీ వ్యాల్యూ పడిపోయింది. వివిధ కారణాల వల్ల అమెజాన్ మార్కెట్ వ్యాల్యూ ఇప్పుడు 930 బిలియన్ డాలర్లుగా ఉంది.

అమెజాన్...

అమెజాన్...

అమెరికాకు చెందిన మూడు కంపెనీలు ఒకేసారి 1 ట్రిలియన్ డాలర్ల సమూహంలో ఉండటం ఇదే మొదటిసారి. గతంలో అమెజాన్ ఈ స్థాయికి చేరుకున్నా ఆ తర్వాత పడిపోవడంతో ఒకేసారి మూడు కంపెనీలు ఉన్న పరిస్థితులు లేవు. ఆయిల్ దిగ్గజం సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో మార్కెట్ వ్యాల్యూ గత నెలలో దాదాపు 2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా టాప్ ఫైవ్ కంపెనీల్లో సౌదీ ఆరామ్‌కో, యాపిల్, మైక్రోసాఫ్ట్, పెట్రో చైనా, అల్భాబెట్ వరుసగా ఉన్నాయి.

అల్భాబెట్ రికార్డ్

అల్భాబెట్ రికార్డ్

అమెజాన్ మార్కెట్ వ్యాల్యూ 2018 సెప్టెంబర్‌లో 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ సమయంలో యాపిల్ ఒక్కటే ఈ మార్క్ దాటింది. మైక్రోసాఫ్ట్ ఆ తర్వాత దాటింది. ఇప్పుడు అల్భాబెట్ ఈ రికార్డును అందుకుంది. అల్భాబెట్ షేర్లు 2020లో 8 శాతం ఎదగడం గమనార్హం. ఈ కంపెనీ సీఈవోగా గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ సుందర్ పిచాయ్‌ను నియమిస్తూ గత ఏడాది కంపెనీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

English summary

1 లక్షకోట్ల డాలర్ల అమెరికా కంపెనీగా... సుందర్ పిచాయ్ నేతృత్వంలోని అల్భాబెట్ అరుదైన రికార్డ్: | Google owner Alphabet is now worth $1 trillion

The exclusive $1 trillion club on Wall Street just got a new member. Shares of Google parent company Alphabet hit a new all-time high Thursday, pushing the company's market value to $1 trillion in the process.
Story first published: Friday, January 17, 2020, 11:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X