For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google Startup School: మీ దగ్గర స్టార్టప్ ఐడియా ఉందా..? అయితే గూగుల్ స్కూల్ మీకు సాయం చేయనుంది.. ఎలాగంటే..

|

Google School: చాలా మంది ఈ రోజుల్లో ఉద్యోగం కన్నా సొంత వ్యాపారం ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం స్టార్టప్ బూమ్ నడుస్తుండటంతో వారి కలలను నిజం చేసుకోవటానికి అనేక అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దేశంలోని టైర్ II & III నగరాల్లోని 10,000 స్టార్టప్‌లకు గైడ్ చేసేందుకు స్టార్టప్ స్కూల్‌ను ప్రారంభించినట్లు గూగుల్ ఇండియా బుధవారం ప్రకటించింది. ముఖ్యంగా చిన్న నగరాల్లోని వారికి దీని ద్వారా శిక్షణ అందించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ స్కూల్ లో ఏమి నేర్పిస్తారు..

ఈ స్కూల్ లో ఏమి నేర్పిస్తారు..

స్టార్టప్ స్కూల్ అనేది ఎదుగుతున్న కంపెనీలకు అవసరమైన సాధనాలు, ఉత్పత్తులు, జ్ఞానంతో పాటు ప్రారంభ-దశ స్టార్టప్ వ్యవస్థాపకులను సన్నద్ధం చేయడానికి రూపొందించబడిన ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమం అని కంపెనీ తెలిపింది. ప్రభావవంతమైన ప్రొడక్ట్ వ్యూహాన్ని రూపొందించడం, ప్రొడక్ట్ వినియోగదారు విలువపై డైవ్‌లు, రోడ్‌మ్యాపింగ్, ప్రొడక్ట్ అవసరాల డాక్యుమెంట్ డెవలప్‌మెంట్, భారతదేశం వంటి మార్కెట్‌ల్లో నెక్స్ట్ బిలియన్ వినియోగదారుల కోసం యాప్‌లను రూపొందించడం, వినియోగదారు సముపార్జనను నడపడం వంటి మరెన్నో విషయాలపై పాఠ్యాంశాలు సూచనాత్మక మాడ్యూళ్లను కలిగి ఉంటాయి.

ఎన్నివారాలు..

ఎన్నివారాలు..

తొమ్మిది వారాల ప్రోగ్రామ్‌లో ఫిన్‌టెక్, D2C, B2B, B2C ఈ-కామర్స్, భాష, సోషల్ మీడియా, నెట్‌వర్కింగ్, జాబ్ సెర్చ్‌లో విస్తరించి ఉన్న స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోని Google నాయకులు, ట్రైల్‌బ్లేజింగ్ సహకారుల మధ్య ఫైర్‌సైడ్ చాట్‌లు కూడా ఉంటాయి.

లక్ష్యం ఏమిటంటే..

లక్ష్యం ఏమిటంటే..

"ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని సమర్థవంతమైన స్థాపకునిగా మార్చడం, ఏఏ పనులు లేదా ప్రవర్తన వల్ల వారు మంచి స్థాపకులుగా మారతారు అనే అంశాలపై చర్చతో పాటు సరైన ఉద్యోగులను ఎలా నియమించుకోవాలో తెలుసుకోవచ్చని" డెవలపర్ రిలేషన్స్ ప్రోగ్రామ్ మేనేజర్ కార్తీక్ పద్మనాభన్ మరియు డైరెక్టర్ - ప్లే పార్టనర్‌షిప్స్ ఆదిత్య స్వామి బ్లాగ్‌పోస్ట్‌లో రాశారు.

దేశంలో భారీగా స్టార్టప్‌లు..

దేశంలో భారీగా స్టార్టప్‌లు..

దాదాపు 70,000 స్టార్టప్‌లతో భారతదేశం ప్రపంచంలోనే స్టార్టప్‌ల కోసం మూడవ అతిపెద్ద జన్మస్థలంగా ఉంది. ఎక్కువ మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కంపెనీలను విజయవంతంగా IPOలు లేదా యునికార్న్ హోదాకు నడిపిస్తున్నందున, వారి విజయం దేశంలోని యువతలో కొత్త ఆకాంక్షలను రేకెత్తిస్తోంది. ఇకపై స్టార్టప్‌లు కేవలం బెంగళూరు, ఢిల్లీ, ముంబై లేదా హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కావు. దేశంలో జైపూర్, ఇండోర్, గోరఖ్‌పూర్ తో పాటు మరిన్ని కేంద్రాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక స్టార్టప్‌లు ఉన్నాయి.

అనేక స్టార్టప్ లు తొలిదశలోనే విఫలం..

అనేక స్టార్టప్ లు తొలిదశలోనే విఫలం..

దేశంలో ప్రారంభమైన స్టార్టప్ లలో దాదాపు 90 శాతం వాటి మెుదటి ఐదు సంవత్సరాల ప్రయాణంలోనే విఫలమయ్యాయి. దీని వెనుక ముఖ్యంగా సరైన ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్ లేకుండా ఖర్చుచేయటం, డిమాండ్ ను తప్పుగా అంచనా వేయటం, నాయకత్వ లోపం, సరైన నిర్వహణ లేకపోవటం వంటి అనేక కారణాల వల్ల దీనికి కారణాలుగా తెలుస్తోంది. అందువల్ల స్టార్టప్ వ్యవస్థాపకులకు ఈ విషయాలపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించగల ప్రోగ్రామ్‌ల అవసరం ఉంది. ప్రస్తుతం గూగుల్ స్కూల్ ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు దీని ద్వారా మనకు అర్థం అవుతుంది.

Read more about: google startup గూగుల్
English summary

Google India launches Startup School to train and gide 10,000 startups in smaller cities in remote manner

Google India launches Startup School to train new startup founders of smaller cities
Story first published: Thursday, July 7, 2022, 10:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X