For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google desktop dark mode: అందుబాటులో కొత్త ఫీచర్: ఎలా సెట్ చేసుకోవాలంటే..?

|

వాషింగ్టన్: టాప్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో వినూత్నమైన ఫీచర్‌ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, తిరుగులేని ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ అమెరికా బేస్డ్ సెర్చ్ఇంజిన్ తాజాగా క్రోమ్ డెస్క్‌టాప్/వెబ్ వెర్షన్ యూజర్ల కోసం డార్క్ మోడ్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు యూజర్లు సిస్టమ్ థీమ్‌ను డార్క్ మోడ్‌లో పెట్టుకుంటే గూగుల్ క్రోమ్ డెస్క్‌టాప్ కూడా ఆటోమేటిగ్గాడార్క్ మోడ్‌కు మారుతుంది. ఇదివరకు ఆ సౌకర్యం ఉండేది కాదు.

 2019లోనే..

2019లోనే..

గూగుల్ తొలిసారిగా 2019లో నైట్ మోడ్/డార్క్‌మోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్లో దీన్ని ఆండ్రాయిడ్ 10కే పరిమితం చేసింది. అనంతరం దాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వచ్చింది. ఇందులో మార్పులు చేర్పులు చేసింది. ఈ సంవత్సరం మే నెలలో ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ బేస్డ్ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2019లోనే డెస్క్‌టాప్ యూజర్ల కోసం క్రోమ్‌ను నైట్ మోడ్ లేదా డార్క్ మోడ్‌లోకి తీసుకుని రావాలనే డిమాండ్ వినిపించింది.

 అందుబాటులో..

అందుబాటులో..

దీనిపై ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లు తమ ఫీడ్‌బ్యాక్‌ను గూగుల్ మేనేజ్‌మెంట్‌కు పంపించారు. దీనికి అనుగుణంగా దాన్ని అప్‌డేట్ చేసింది. కొత్తగా దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. Google.com డెస్క్‌టాప్ వెబ్ కోసం ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేసింది గూగుల్ మేనేజ్‌మెంట్. ఇక పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రావడానికి ఇంకో వారం రోజులు పట్టొచ్చని తెలిపింది. డెస్క్‌టాప్ నైట్ మోడ్/డార్క్‌మోడ్ కోసం అనేక దేశాల నుంచి తమకు ఫీడ్‌బ్యాక్ అందిందని గూగుల్ సెర్చ్ ప్రొడక్ట్ సపోర్ట్ మేనేజర్ హంగ్ ఎఫ్ తెలిపారు.

 సెట్టింగ్స్ ఇలా..

సెట్టింగ్స్ ఇలా..

దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే.. తొలుత న్యూ ట్యాబ్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం సెర్చ్ పేజీ టాప్‌లో కుడివైపు కార్నర్‌లో ఉన్న బటన్స్‌పై క్లిక్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత.. ఎడమవైపున అప్పియరెన్స్ అనే అక్షరాలు కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత డివైస్ డిఫాల్ట్, డార్క్ లేదా లైట్ థీమ్ అని కనిపిస్తుంది. డివైస్ డిఫాల్ట్‌ను క్లిక్ చేస్తే.. బ్రౌజింగ్ పేజ్ యధాతథంగా కనిపిస్తుంది.

 డార్క్ లేదా లైట్ థీమ్..

డార్క్ లేదా లైట్ థీమ్..

డార్క్ అనే అక్షరాలను క్లిక్ చేస్తే.. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం నైట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. టెక్స్ట్ లైట్ కలర్‌లో కనిపిస్తాయి. ఆ థీమ్‌ను సెలెక్ట్ చేసుకున్న తరువాత సేవ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి సేవ్ చేస్తే.. ఒక్క గూగుల్ మాత్రమే కాకుండా.. అన్ని సెర్చ్ పేజీలు డార్క్ మోడ్‌లోకి మారుతాయి. గూగుల్ హోమ్‌పేజీ, సెర్చ్ రిజల్ట్ పేజీ, సెర్చ్ సెట్టింగ్స్.. ఇతరత్రా వన్నీ కూడా డార్క్‌మోడ్‌లో ఉంటాయి. సేవ్ అనే ఆప్షన్‌ను డిస్ ఫంక్షన్ చేస్తే.. గూగుల్ హోమ్ పేజీ మళ్లీ యధాతథ స్థితికి చేరుకుంటుంది.

ఇంకో వారంలో పూర్తిస్థాయిలో..

ఇంకో వారంలో పూర్తిస్థాయిలో..

ఒకవేళ సెట్టింగ్స్‌లో ఉన్న అప్పియరెన్స్‌లోకి వెళ్లినప్పుడు మనకు డివైస్ డిఫాల్ట్, డార్క్ లేదా లైట్ థీమ్ అనే అక్షరాలు కనిపించకపోతే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే- పూర్తిస్థాయిలో ఈ డార్క్‌మోడ్ లేదా నైట్ మోడ్ అందుబాటులోకి రావడానికి వారం రోజులు పడుతుందని గూగుల్ సెర్చ్ ప్రొడక్ట్ సపోర్ట్ మేనేజర్ హంగ్ ఎఫ్ చెప్పారు. అన్ని కాంటినెంటల్స్‌లోనూ ఈ సౌకర్యం వినియోగంలోకి రావడానికి వారం రోజుల సమయం పడుతుందని అన్నారు.

English summary

Google desktop dark mode: అందుబాటులో కొత్త ఫీచర్: ఎలా సెట్ చేసుకోవాలంటే..? | Google has announced support for dark mode theme for Search on desktop

Google had announced its first introduced a system dark mode in 2019 with the launch of Android 10. The tech giant had officially rolled out a night mode for Search apps on Android and iOS in May last year.
Story first published: Saturday, September 11, 2021, 20:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X