For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోలుకుంటోంది కానీ..: గూగుల్ డేటా ఇండియన్ ఎకానమీ రికవరీపై ఏం చెబుతోంది?

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పాటు భారత్ కూడా చితికిపోయింది. ఆర్థిక వ్యవస్థ కంటే ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చి.. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచంలో అతిపెద్ద లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు మూడు నెలల పాటు కొనసాగిన లాక్ డౌన్ ఆ తర్వాత ప్రజల్లో అవగాహన వచ్చిన తర్వాత అన్-లాక్ చేశారు. సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మసకబారింది. గూగుల్ మొబిలిటీ ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం భారత ఎకానమీ సాధారణ స్థితికి చేరుకుంటోంది.

గోడకు కొట్టిన బంతిలా.. భారత్ అదుర్స్! గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్థికవేత్తగోడకు కొట్టిన బంతిలా.. భారత్ అదుర్స్! గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్థికవేత్త

భారత్ రికవరీ.. ఐనా చాలా సమయం

భారత్ రికవరీ.. ఐనా చాలా సమయం

గుగుల్ కోవిడ్ 19 కమ్యూనిటీ మొబిలిటీ నివేదిక ప్రకారం... భారత ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా లాక్ డౌన్ కంటే ముందుకు చేరుకుంటున్నాయి. విద్యుత్ వినియోగం నుండి ఉద్యోగాల వరకు కరోనా కారణంగా భారీ ప్రభావం పడింది. క్రమంగా కోలుకుంటున్నప్పటికీ పూర్తి రికవరీకి చాలా సమయం పడుతుంది. రిటైల్-వినోదం, గ్రాసరీ-ఫార్మసీ, ట్రాన్సుపోర్ట్ హబ్స్, పార్కులు, వర్క్ ప్లేస్, నివాస ప్రాంతాల్లో క్రమంగా ఇంప్రూమెంట్ కనిపిస్తోంది. జూన్ 1వ తేదీ నుండి ఇది కనిపిస్తోంది. జూన్ 8వ తేదీన కేంద్రం అన్-లాక్ ప్రకటించింది.

విద్యుత్ వినియోగం

విద్యుత్ వినియోగం

భారత పారిశ్రామిక, ఉత్పాదక రంగాలలో డిమాండ్‌ను విద్యుత్ వినియోగం ద్వారా కూడా అంచనా వేస్తారు. మార్చి 25వ తేదీన లాక్ డౌన్ విధించిన తర్వాత విద్యుత్ వినియోగం భారీగా క్షీణించింది. జూన్ నుండి క్రమంగా మెరుగు పడుతోంది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ ప్రకారం జూన్ 28తో ముగిసిన వారంతో స్వల్పంగా తగ్గింది. అయితే క్రమంగా పెరుగుతోంది.

నిరుద్యోగిత-ఉద్యోగాలు

నిరుద్యోగిత-ఉద్యోగాలు

కరోనా మహమ్మారి కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో నిరుద్యోగిత ఏకంగా 27 శాతానికి కూడా చేరుకుంది. 122 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే 12.2 కోట్లకు పైగా ఉద్యోగాలు పోయాయి. అయితే అన్-లాక్ తర్వాత నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గుముఖం పట్టింది. జూలై 5తో ముగిసిన వారంతో నిరుద్యోగిత రేటు 8.9 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఇది 8.6 శాతంగా ఉంది. అంటే ఉద్యోగాలు కూడా కోలుకున్నాయి.

రిటైల్, పెట్రోలియం

రిటైల్, పెట్రోలియం

మే నెలకంటే జూన్ నెలలో రిటైల్ స్టోర్స్‌ను సందర్శించే వారి సంఖ్య పెరిగింది. అయితే ఏడాది క్రితంతో పోలిస్తే తక్కువే ఉంది. ఇక పెట్రోలియం వినియోగం 2007 నుండి అతి తక్కువగా వినియోగించబడింది. గత నెల నుండి వాహనాలు రోడ్ల పైకి రావడంతో క్రమంగా పెట్రోలియం వినియోగం పెరిగింది. లోన్ - డిపాజిట్ రేషియో సానుకూలంగా కనిపిస్తోంది.

English summary

కోలుకుంటోంది కానీ..: గూగుల్ డేటా ఇండియన్ ఎకానమీ రికవరీపై ఏం చెబుతోంది? | Google data indicate Indian economy hobbling back to normalcy

India’s economy is struggling to overcome the adverse hit from the world’s biggest lockdown, a series of high-frequency indicators show.
Story first published: Friday, July 10, 2020, 16:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X