For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sundar Pichai: 30 వేల పిక్సెల్ ఫోన్లను ఉచితంగా పంచిన గూగుల్.. ఎందుకంటే..

|

అమెరికాకు వచ్చే ఉక్రేనియన్, ఆఫ్గన్ శరణార్థుల కోసం అమెరికాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ కంపెనీ గూగుల్ తన వంతు సాయం అందిస్తోంది. ఇందుకోసం తమ వంతుగా 30,000 పిక్సెల్ ఫోన్లను విరాళంగా ఇచ్చినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బ్లాగ్ పోస్ట్ లో ఇటీవల వెల్లడించారు. ఇతర విషయాలతోపాటు.. సంస్థ గ్రాంట్ ఫండింగ్‌లో, సెర్చ్ అడ్వర్టైజ్‌మెంట్లలో ఒక్కొక్కటి ఒక మిలియన్‌ డాలర్లను అందించిందని పిచాయ్ తెలిపారు. "గూగుల్ ట్రాన్స్‌లేట్ వంటి సాధనాలు శరణార్థులకు వారి కొత్త కమ్యూనిటీలతో కమ్యూనికేట్ సహాయపడతాయని అభిప్రాయపడ్డారు."

"ఈరోజు మేము ఇంతకు ముందు అందించిన మెుబైళ్లకు అదనంగా మరో 20,000 పిక్సెల్ ఫోన్‌లను విరాళంగా అందిస్తున్నాము. ఉక్రేనియన్, ఆఫ్ఘన్ నుంచి అమెరికాకు వస్తున్న శరణార్థులకు ఇవి సహాయకంగా ఉంచాయి. యూఎస్ కు వచ్చిన వారు తమ సొంత ప్రాంతాల్లో ఉన్న అనుభూతిని పొందగలరు" పిచాయ్ ఈ నెల 20న ట్విట్టర్ ద్వారా తెలిపారు. కంపెనీ ఇప్పటివరకు మొత్తం శరణార్థులకు 30,000 పిక్సెల్ ఫోన్‌లను విరాళంగా అందించిందని సుందర్ పిచాయ్ షేర్ చేసిన గూగుల్ బ్లాగ్‌పోస్ట్ ద్వారా తెలుస్తోంది.

google donated pixel mobiles in thousands for free know abou it in detail

ముందుగా మేలో Google ఉక్రెయిన్ సపోర్ట్ ఫండ్ అందుకునే మొదటి 17 మంది వివరాలను పిచాయ్ ప్రకటించారు. వీరు స్టార్టప్‌ల కోసం Google నుంచి ఆర్థిక సహాయం, గైడెన్స్ పొందనున్నారు. సరైన వ్యక్తులు, పద్ధతులతో ప్రారంభ దశ స్టార్టప్‌లను కనెక్ట్ చేయడం ద్వారా వారికి సహాయపడే ప్రోగ్రామ్ ఇది అని సుందర్ పిచాయ్ వెల్లడించారు.

"మార్చిలో పోలాండ్‌లోని వార్సాలో ఉన్నప్పుడు.. యుక్రేనియన్ వ్యాపార వ్యవస్థాపకులు యుద్ధ సమయంలో తమ వ్యాపారాలను నిర్వహించడానికి, అభివృద్ధి చేయడానికి మా ఉక్రెయిన్ సపోర్ట్ ఫండ్‌ను ప్రకటించాను. స్టార్టప్‌ల కోసం Google నుంచి ఫైనాన్సింగ్ + మార్గదర్శకత్వం పొందిన మొదటి గ్రహీతలను ఈ రోజు మేము స్వాగతిస్తున్నాము "అని పిచాయ్ ట్వీట్ చేశారు.

English summary

Sundar Pichai: 30 వేల పిక్సెల్ ఫోన్లను ఉచితంగా పంచిన గూగుల్.. ఎందుకంటే.. | google ceo sundhar pichai disclosed that google donates pixel mobiles to afghan, ukraine refugees came to us

google donated pixel mobiles in thousands for free know abou it in detail
Story first published: Friday, June 24, 2022, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X