For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా వెలుపల... హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద గూగుల్ కార్యాలయం!

|

అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ తన రెండో అతిపెద్ద కార్యాలయ ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో నిర్మించనుంది. అమెరికా మౌంటెన్ వ్యూ తర్వాత అతిపెద్ద గూగుల్ కార్యాలయం ఇది. అగ్రరాజ్యం వెలుపల గూగుల్‌కు ఇదే అతిపెద్ద కార్యాలయం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 7.3 ఎకరాలలో 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే కార్యాలయ ప్రాంగణ సముదాయం నిర్మాణానికి గురువారం తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని గూగుల్ తెలిపింది. భవనం నమూనాను విడుదల చేశారు.

అవగాహన ఒప్పందం

అవగాహన ఒప్పందం

తెలంగాణ, గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పౌర సేవలు, విద్య, ఇతర రంగాల్లో ప్రభుత్వానికి గూగుల్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల్లో గూగుల్‌తో కలిసి పని చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ ఒప్పందంతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. హైదరాబాద్‌లో గూగుల్ తన మూలాలను మరింత బలోపేతం చేయడానికి సంతోషంగా ఉందన్నారు. గూగుల్ 2017 నుండి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందన్నారు. ఇంతకుముందు చేసుకున్న ఎంవోయులు గొప్ప కార్యక్రమాలకు దారి తీశాయని, యువత, మహిళలు, విద్యార్థులు, పౌరసేవల్లో మార్పు తీసుకు రావడంపై దృష్టి సారించామన్నారు.

మరింత దృఢంగా..

మరింత దృఢంగా..

గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ కంట్రీ హెడ్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ... హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించడంతో తెలంగాణతో తమ అనుబంధం మరింత దృఢంగా మారిందన్నారు. ప్రపంచంలో అత్యధిక మంది ఉద్యోగులు పని చేసే కేంద్రాల్లో ఇది కూడా ఒకటి అన్నారు.

హైదరాబాద్ కేంద్రంగా

హైదరాబాద్ కేంద్రంగా

మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లు అమెరికాలోని తమ ప్రధాన కార్యాలయాలను మినహాయించి, వెలుపల హైదరాబాద్‌లోనే అతిపెద్ద కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాయి. ఇప్పుడు గూగుల్ అదే దారిలో నడిచింది. హైదరాబాద్ గూగుల్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఉన్నారు. గూగుల్‌కు ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 30 లక్షల చదరపు అడుగుల సామర్థ్యం కలిగిన బిల్డింగ్ కెపాసిటీ ఉంది. ఇప్పుడు మరో 30.3 లక్షల చదరపు అడుగుల సామర్థ్యం కలిగిన భవనం నిర్మిస్తోంది.

English summary

అమెరికా వెలుపల... హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద గూగుల్ కార్యాలయం! | Google begins work on Hyderabad campus, largest outside its headquarters

Internet giant Google on Thursday began work in Hyderabad on its largest campus outside of its headquarters in the US.
Story first published: Friday, April 29, 2022, 8:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X