For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI: ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఎస్బీఐ సంచలన నిర్ణయం, మినిమం బ్యాలెన్స్ అవసరంలేదు

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు వరుసగా గుడ్ న్యూస్‌లు చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వరుసగా వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో కస్టమర్లకు భారీ ఊరట ఇచ్చింది. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా ఉంటుంది. ఇప్పుడు ఈ నిబంధనను రద్దు చేసింది.

కస్టమర్లకు అతిపెద్ద ఊరట

కస్టమర్లకు అతిపెద్ద ఊరట

సేవింగ్స్ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే జరిమానా విధించే నిబంధన రద్దు చేయడం కస్టమర్లకు అతిపెద్ద ఊరట. ఇప్పటి వరకు సగటు నెలవారీ నిల్వ లేని ఖాతాదారుల నుండి అపరాధ రుసుము వసూలు చేసింది. ఇక నుండి కనీస నిల్వ లేకున్నప్పటికీ అపరాధ రుసుము వసూలు చేయదు.

పెనాల్టీ ప్లస్ ట్యాక్స్.. ఇప్పుడు ఉండదు

పెనాల్టీ ప్లస్ ట్యాక్స్.. ఇప్పుడు ఉండదు

మెట్రో, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వరుసగా రూ.3,000, రూ.2,000, రూ.1,000 మినిమం బ్యాలెన్స్ ఉండాలి. ఇలా లేకుంటే పెనాల్టీ రూ.5 నుండి రూ.15 వరకు విధిస్తుంది. దీనికి అదనం ట్యాక్స్‌లు. నెలవారీ కనీస నగదు నిల్వ లేనందుకు దీనినిఈ పెనాల్టీ ఉంటుంది. ఎస్బీఐ దారిలోనే మిగతా బ్యాంకులు కూడా నడిస్తే కస్టమర్లకపై భారం తగ్గుతుంది.

కస్టమర్ ఫస్ట్

కస్టమర్ ఫస్ట్

ఎస్బీఐ నిర్ణయం 44 కోట్ల మందికి పైగా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం. ఇది వారికి ఊరటను కలిగిస్తుంది. ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకోవడంపై కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మినిమం బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకు కస్టమర్ల నుండి వసూలు చేసిన మొత్తాలు కోట్లలో ఉంటున్నాయి. కస్టమర్ ఫస్ట్ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది.

English summary

SBI: ఖాతాదారులకు గుడ్‌న్యూస్, ఎస్బీఐ సంచలన నిర్ణయం, మినిమం బ్యాలెన్స్ అవసరంలేదు | Good News for SBI customers, No minimum balance needed for savings accounts

The State Bank of India (SBI) announced today that it has waived off the requirement of holding average monthly balance for savings accounts.
Story first published: Thursday, March 12, 2020, 7:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X